చీరల వ్యాపారంలోకి అంబానీ.. త్వరలో రిటైల్ స్టోర్లు
ప్రపంచంలోనే టాప్ టెన్ కుబేరుల్లో ఒకరైన భారత దేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ రిటైల్ ఈ చీరల వ్యాపారంలోకి దిగింది. చీరలు, భారతీయ సంప్రదాయ దుస్తుల విక్రయం కోసం 'అవంత్రా' బ్రాండ్ నేమ్ తో ప్రత్యేక స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
బెంగళూరులో తొలి స్టోర్ ను ఈ పండుగ సీజన్ లోనే ఏర్పాటు చేయడానికి రిలయన్స్ తెలిపింది. ఆ తర్వాత కర్ణాటకలోని మిగతా ప్రాంతాలతోపాటు ఏపీలోనూ ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అవంత్రా తన సొంత బ్రాండ్ దుస్తుల విక్రయంతోపాటు ఆయా ప్రాంతాల నేత కార్మికులు, నల్లీ సిల్క్స్, పోతీస్ వంటి ప్రైవేటే బ్రాండ్లతోనూ భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు తెలిసింది. టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్, ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన బిర్లా ఫ్యాషన్ రిటైల్ కు పోటీగా రిలయన్స్ ఈ వ్యాపారాన్ని నెలకొల్పుతున్నట్టు తెలిసింది.
పండుగలు , వివాహ సీజన్ కు ముందు రిలయన్స్ రిటైల్ చేసిన ఈ ప్రకటన షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రైవేట్ లేబుల్ లను విక్రయించడమే కాకుండా.. అవంత్రా ప్రాంతీయ నేత క్లస్టర్ లు, నల్లి సిల్క్స్, పోతీస్ వంటి థర్డ్ పార్టీ బ్రాండ్ లతో రియలన్స్ జతకడుతోంది.
గ్లోబల్ బ్రాండ్ లు కూడా భారతీయ మార్కెట్ లో తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. సాంప్రదాయ దుస్తులకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఈ విభాగంలో చాలా బ్రాండ్ లు తమ స్వంత సేకరణలను ప్రారంభించానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీంతో మహిళల సంప్రదాయ దుస్తుల మార్కెట్ వార్షికంగా 10శాతం పెరుగుతుందని అంచనా..