అపోలో ఫార్మసీ లో అమెజాన్ రూ. 740 కోట్ల పెట్టుబడి !

Update: 2020-12-10 05:32 GMT
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఫార్మసీ రంగం జోరు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశీ ఫార్మసిస్‌ రంగంపై కన్నేసిన గ్లోబల్ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా అపోలో ఫార్మసీపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అపోలో ఫార్మసీలో 10 కోట్ల డాలర్లను (అంటే మన కరెన్సీ లో  సుమారు రూ. 740 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.  దేశీయంగా ఓవైపు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మరోపక్క పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ ఫార్మసీ విభాగంలో విస్తరణకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఫార్మసీలో పెట్టుబడుల ద్వారా అమెజాన్‌ వాటికి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తుంది.  ఇప్పటికే ప్రారంభమైన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇటీవల ఆన్‌లైన్‌ ఫార్మసీ సంస్థ నెట్‌ మెడ్స్‌ లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. రూ. 620 కోట్లు వెచ్చించడం ద్వారా నెట్‌ మెడ్స్ ‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఆగస్ట్‌ లోనే ఆర్ ‌ఐ ఎల్‌ వెల్లడించింది. దీంతో డిజిటల్‌ అనుబంధ విభాగం రిలయన్స్‌ జియో.. ఈకామర్స్‌ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం ప్రవేశించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఆర్ ఐ  ఎల్‌ డీల్‌ ప్రకారం నెట్‌ మెడ్స్‌ విలువ రూ. 1,000 కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. కాగా, ఆగస్ట్‌ మొదటి వారంలో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. బెంగళూరులో ఆన్ ‌లైన్‌ ఫార్మసీ విక్రయాలు ప్రారంభించింది. ఆన్‌ లైన్ ఫార్మసీ కంపెనీ 1ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుకి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిద్వారా ఈ విభాగంలో ప్రధాన కంపెనీలైన మెడ్ ప్లస్, నెట్ మెడ్స్, ఫార్మజీ, 1ఎంజీ మధ్య పోటీ తీవ్రతరం కానున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి
Tags:    

Similar News