విజయ్ మాల్యా కౌంట్ డౌన్.. భారత్ కు రావాల్సిందే..
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రుణాల ఎగవేత కేసులో యూకే కోర్టుల్లో పోరాడుతున్న భారత్ కు శుభవార్త అందింది. విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని 2018లో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ యూకే సుప్రీం కోర్టులో అప్పీలు చేసేందుకు మాల్యాకు అనుమతి లభించలేదు. దీంతో మాల్యాకు అన్ని దారులు మూసుకుపోయాయి. అతడిని భారత్ కు అప్పగించడం వినహా యూకే దేశానికి వేరే గత్యంతరం లేకుండా పోయింది.
ప్రస్తుతం కోర్టు తీర్పుతో భారత్-బ్రిటన్ నేరస్థుల ఒప్పందం ప్రకారం 28 రోజుల్లో మాల్యాను భారత్ కు అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులను బ్రిటన్ హోమ్మంత్రి ప్రీతి పటేల్ ధ్రువీకరించాల్సి ఉంటుంది.
కోర్టు దారులు మూసిపోవడం.. మాల్యాకు వేరే దారిలేకపోవడంతో నెలరోజులలోపే భారత్ కు బ్రిటన్ అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు భారత దర్యాప్తు సంస్థలు మాల్యాను భారత్ కు తీసుకురావడానికి బ్రిటన్ ప్రభుత్వంతో రాయబారాలు నడుపుతున్నాయి.
*9వేల కోట్ల స్కాం చేసి పరార్
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తరుఫున 9వేల కోట్ల రుణాలను బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించకుండా ఎగవేశాడు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో బ్రిటన్ కు పారిపోయాడు. ప్రస్తుతం రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాల్యా చెబుతున్నా బ్యాంకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం బ్రిటన్ లో అరెస్ట్ అయ్యి బెయిల్ పై కోర్టుకు హాజరు అవుతున్నాడు. మాల్యాను భారత్ కు తీసుకువస్తే మోడీ సర్కార్ కు అదో విజయం అవుతుంది.