వైసీపీలో చేరిన జూపూడి, ఆకుల.. ఏం మాట్లాడారంటే...

Update: 2019-10-08 10:12 GMT
ఏపీలో రెండు రోజులుగా వైర‌ల్ అవుతున్న‌ట్టుగానే ఇద్ద‌రు మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఆ ఇద్ద‌రు నేత‌లు ద‌స‌రా రోజున ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో చేరిపోయారు. రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌,  పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో వీరంతా వైసీపీ కండువాలు క‌ప్పేసుకున్నారు.

ఇక ఆకుల స‌త్య‌నారాయ‌ణ గ‌తంలో బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌లోకి జంప్ చేసి... ఆ పార్టీ త‌ర‌పున రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. జ‌న‌సేన‌లో ఆయ‌న ప్ర‌స్థానం నెల‌ల్లోనే ముగించేశారు. వైసీపీలో చేరిన ఆయ‌న మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పింది చెప్పిన‌ట్టు పాల‌న చేస్తోన్న గొప్ప సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్న ఆయ‌న రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నార‌ని కొనియాడారు. ఇక ఆకుల పార్టీ మార్పు వెన‌క ఆయ‌న‌కు ఓ ప‌ద‌విపై హామీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి రూర‌ల్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆకుల వీర్రాజును త‌ప్పించి.... ఆ ప్లేస్‌లో ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇక టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు గ‌తంలో వైసీపీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తిరిగి వైసీపీ గూటికి చేరిన ఆయ‌న మాట్లాడుతూ మ‌ద్య నిషేధం పై గ‌తంలో చాలా మంది సీఎంలు హామీ ఇచ్చినా దానిని జ‌గ‌న్ మాత్ర‌మే అమ‌లు చేశార‌ని కొనియాడారు. ఇక తాను టీడీపీలోకి వెళ్లి పొర‌పాటు చేశాన‌ని... ఈ సీఎం ఓ మిస్సైల్ అంటూ ప్ర‌శంసించారు. ఐదుగురు దళితులకు కేబినేట్‌లో సీఎం జగన్‌ స్థానం కల్పించ‌డంతో దేశం మొత్తం ఈ విషయం గురించే చ‌ర్చించుకుంటుంద‌ని చెప్పారు. అలాగే తాను ఎలాంటి హామీలు లేకుండా బేష‌ర‌తుగానే పార్టీలో చేరాన‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. జగన్‌లో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నాయ‌ని... ఆంధ్రా ఐరన్‌ మ్యాన్‌ విజయసాయిరెడ్డి అని చెప్పారు.
Tags:    

Similar News