• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూ.10వేల కోట్ల బకాయి...

రూ.10వేల కోట్ల బకాయి చెల్లించిన ఎయిర్‌ టెల్!

By - Tupaki Desk
Update: 2020-02-17 15:58 GMT
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో భార‌తి ఎయిర్‌టెల్ కంపెనీ.. ఈ రోజు 10వేల కోట్ల ఏజీఆర్ బ‌కాయిల‌ను టెలికాంశాఖ‌కు చెల్లించింది. టెలికాం డిపార్ట్‌ మెంట్‌ కు ఎయిర్‌టెల్ మొత్తం 35, 500 కోట్లు బ‌కాయి ఉన్న‌ది. స్పెక్ట్ర‌మ్ చార్జీలు, లైసెన్సు ఫీజుల కింద ఆ సంస్థ బకాయి ఉన్న‌ది. భార‌తి ఎయిర్‌ టెల్ లిమిటెడ్ త‌ర‌పున 9500 కోట్లు, భార‌తి హెక్సాకామ్ త‌ర‌పున 500 కోట్లు చెల్లించిన‌ట్లు భార‌తి ఎయిర్‌ టెల్ ఈ రోజు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

తాము స్వయం మదింపు కసరత్తు చేపట్టామని, అది ముగిసిన వెంటనే సుప్రీంకోర్టు లో తదుపరి విచారణ గడువులోగా మిగిలిన బకాయిల చెల్లింపును చేపడతామని ఆ సంస్థ స్పష్టం చేసింది. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం శాఖ భారతి ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ , ఐడియా సహా టెలికాం కంపెనీలను కోరుతూ ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . టెలికాం శాఖ ఆదేశాలకు బదులిచ్చిన ఎయిర్‌ టెల్‌ తాము ఫిబ్రవరి 20లోగా రూ 10,000 కోట్లు చెల్లిస్తామని, మార్చి 17లోగా మిగిలిన మొత్తం చెల్లిస్తామని తెలిపింది.

ఇకపోతే టెలికాం సంస్థ‌లు బకాయీలు చెల్లించ‌డం లేదంటూ.. ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇదే సమయంలో టెలికాం సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ టెలికాం విభాగంలోని ఓ డెస్క్‌ అధికారి ఆదేశాలు ఇవ్వడంపైనా అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. గతవారం కోర్టు ఆగ్రహించడం తో టెలికాం కంపెనీలు దిద్దుబాటు చర్యలను చేపట్టాయి.
Tags:    
  • Airtel pays Rs 10 
  • 000 crore to DoT as part payment towards AGR dues 
  • Airtel 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS