బ్రెడ్ ప్యాకెట్ లో బతికున్న ఎలుక?

Update: 2015-10-13 15:11 GMT
వినటానికి విచిత్రంగా ఉండటమే కాదు.. సాధ్యమే కాదన్నట్లు అనిపించే ఈ ఘటన నిజంగా చోటు చేసుకుంది. అది కూడా ఎక్కడో కాదు.. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో. చాలా ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటన తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఆసుపత్రి లోని రోగికి సిబ్బంది ఇచ్చిన ప్యాకెట్ ను విప్పిన సమయంలో అందులో నుంచి ఎలుక బయటకు రావటంతో రోగి.. అతని బంధువులే కాదు.. ఆసుపత్రి సిబ్బంది షాక్ తిన్నారు.

ఎయిమ్స్ లాంటి ఆసుపత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం.. ఈ విషయం కానీ బయటకు పొక్కితే రచ్చ అవుతుందని భావించిన ఎయిమ్స్ గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని బయటకు రానివ్వకుండా చేసింది.

ఈ దారుణ ఘటన ఈ ఏడాది జూలై 29న చోటు చేసుకుంది. ఎయిమ్స్ లోని ఒక రోగికి ఆసుపత్రి వర్గాలు బ్రెడ్ పాకెట్ ఇచ్చారు. తినేందుకు సీల్ తీసిన భ్రెడ్ ప్యాకెట్ లో నుంచి ఎలుక పిల్ల బయటకు దూకటంతో వారి నోట మాట రాని పరిస్థితి. ఈ బ్రెడ్ ను ఎంఎస్ బాన్ న్యూట్రియెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తయారు చేసింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడిన ఎయిమ్స్.. అంతర్గతంగా మాత్రం చర్యలు తీసుకుంది. ఈ బ్రెడ్ సప్లయ్ చేసిన కంపెనీపై మూడేళ్ల పాటు నిషేధపు వేటు వేయటంతో పాటు.. నోటీసులు జారీ చేశారు. అసలు బ్రెడ్ ప్యాకెట్ లోకి ఎలుక వచ్చిందో చెప్పాలని కోరింది.కానీ.. ఇప్పటివరకూ ఆ కంపెనీ దీనికి సమాధానం ఇవ్వకపోవటం గమనార్హం.
Tags:    

Similar News