బ్రేకింగ్: ప్రముఖ నటి కుమారుడికి కరోనా
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అత్యధికంగా నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత భాగ్య నగరంలోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్ లో 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1275కి చేరుకుంది. ముఖ్యంగా జియాగూడలో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రముఖ నటి కుమారుడు కూడా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో 9మంది కరోనా పాజిటివ్ గా తేలారు. వీరిలో ఓ ప్రముఖ సినీ నటి కుమారుడు కూడా ఉన్నాడు. ఇటీవలే ఆయన అత్తగారింటికి వచ్చారు. అక్కడే వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది.
అయితే తనకు వైరస్ సోకిందని తెలియక అతడు అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారందరితో కలిసి సరదాగా గడిపాడు. దీంతో ఇప్పుడు ఇతడికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వారంతా హడలి చస్తున్నారు. తాజాగా వైద్యులు అపార్ట్ మెంట్ లోని 27మంది పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా ఆ ప్రముఖ నటి కుమారుడి పేరును అధికారులు వెల్లడించడం లేదు. గోప్యత పాటిస్తున్నారు.