ప్రియురాలిని ఎంత దారుణంగా చంపేశాడంటే..?

Update: 2020-11-16 04:30 GMT
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఎందుకు చేశాడో తెలీదు కానీ.. జరిగిన ఉదంతం గురించి విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటమే కాదు..మరీ ఇంత దారుణంగా హింసించాల్సిన అవసరం ఉందా? అన్న భావన  కలుగక మానదు. ప్రియురాలిని నరకం చూపించిన ఈ ప్రియుడి ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. గంటల తరబడి నరకయాతన అనుభవించిన ఆ యువతి చివరకు ప్రాణాల్ని కోల్పోయింది. ఈ విషాద ఉదంతం వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా శెల్ గావ్ కు చెందిన యువతికి.. ఆమె ప్రియుడు అవినాశ్ రాజురె లు ఫుణెలో కలిసి ఉంటారు. వారిద్దరు ప్రియురాలి స్వస్థలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారు యలంబ్ ఘాట్ వద్ద ఆగారు. ఏమైందో ఏమోకానీ.. అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఆమెపై ఆ యువకుడు యాసిడ్ దాడికి దిగారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

బాధతో అరుస్తున్నా..పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో భయంకరమైన బాధను అనుభవిస్తున్న ఆమెను చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలిన గాయాలతో అల్లాడుతున్న ఆమెను..ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 16 గంటల నరకయాతన తర్వాత ఆమె కన్నుమూశారు. ఇంత దారుణానికి కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News