విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ దాడులు

Update: 2021-02-18 13:52 GMT
విజయవాడ-ఇంద్రకీలాద్రిపై ఏసీబీ చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. స్టోర్ , చీరలు, పరిపాలన, ప్రసాదాల తయారీ విభాగాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.నాలుగు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పలు అంశాలపై కీలక అధికారులు, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.  ఈ దాడుల్లో పలు విలువైన ఆధారాలు రాబడుతున్నట్లు సమాచారం.

కనక దుర్గమ్మకు ఎంతో మంది భక్తులు భక్తిశ్రద్ధలతో చీరలను సమర్పిస్తుంటారు. ఆ చీరలను దేవస్థానం ఉన్నతాధికారులు వేలం వేసి విక్రయిస్తుంటారు. వాటిని భక్తులు కొనుగోలు చేస్తారు. ఈ విక్రయాలలో గతంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు.

సూపరింటెండెంట్ కంట్రోల్ ఉండే పట్టు చీరలు గుమస్తాల కంట్రోల్ లోకి వెళ్లాయి. సాధారణంగా గుమాస్తాల కంట్రోల్ లో కాటన్ చీరలు మాత్రమే ఉంటాయి. కానీ పట్టుచీరల లెక్కలను కూడా గుమస్తాలు వారి కంట్రోల్ లోకి తీసుకొన్ని అప్పట్లో చిక్కారు.
Tags:    

Similar News