కంటినిండా నిద్ర‌పోతే క‌రోనా రాదు

Update: 2020-05-07 02:30 GMT
క‌రోనా వైర‌స్‌పై చేస్తున్న అధ్య‌య‌నాలు గ‌తంలో ఏ వ్యాధి.. వైర‌స్‌పై చేసి ఉండ‌రు. ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నుక్కునేందుకు విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు, ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. అయితే ఎన్ని చేసినా ఒక ఆరు నెల‌ల వ‌ర‌కు క‌రోనా నివార‌ణ‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాద‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్పుడు క‌రోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లే వ్యాక్సిన్‌. ముఖ్యంగా క‌రోనా వైర‌స్ రాకుండా ఉండాలంటే మ‌న రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. ఆ శ‌క్తిని పెంచుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ స‌మ‌యంలో క‌రోనా రాకుండా ప‌లు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను వైద్యులు, శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. తాజాగా క‌రోనా వైర‌స్ నిద్ర స‌క్ర‌మంగా పోనివారికి కూడా సోకే ప్ర‌మాదం ఉంద‌ని అమెరికా శాస్త్ర‌వేత్తలు హెచ్చ‌రించారు. నిద్ర స‌రిగ్గా పోకపోతే కరోనాను తట్టుకోలేమని అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.

మనిషి శరీరాన్ని కాపాడటానికి చర్మంతో పాటు శరీర భాగాలు స‌క్ర‌మంగా పని చేయాలంటే బయోలాజికల్ క్లాక్ కరెక్ట్‌గా పని చేయాలని గుర్తుచేస్తున్నారు. అది సక్ర‌మంగా పని చేయాలంటే శరీరానికి కంటినిండా నిద్ర తప్పనిసరిగా కావాల‌ని గుర్తుచేస్తున్నారు. వేళకు తినడం, నిద్రపోవడం చాలా అవసరమ‌ని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంలో నిద్ర కూడా ఒక భాగమ‌ని పేర్కొన్నారు. సరైన వేళలకు నిద్రపోండి.. వైరస్‌పై పోరాటం చేయండి.
Tags:    

Similar News