ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన తల్లి ..

Update: 2021-05-05 11:30 GMT
అమ్మ అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ కి అత్యంత ముఖ్యమైన ఘట్టం. 9 నెలల పాటూ బిడ్డను మోసి... జన్మనివ్వడం అనేది ఎంతో ప్రయాసతో కూడిన ఓ మధురమైన అనుభూతి. అందుకే, చాలా మంది తల్లులు . కడుపులో బిడ్డ ఎలా ఉందో చూసేందుకు అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు. తద్వారా కడుపులో బిడ్డ ఎలా ఉన్నదీ కంప్యూటర్‌ పై కనిపిస్తుంది. పశ్చిమ ఆఫ్రికాలోని 25 ఏళ్ల హలిమా సిస్సే , గర్భం దాల్చింది. తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉందో చూద్దామని కొన్ని నెలల తర్వాత మొరాకోలో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ అల్ట్రాసౌండ్స్ చేస్తూ .. ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే, ఆమె కడుపులో ఏకంగా 7 పసికందులు ఉన్నాయి. మళ్లీ మళ్లీ కౌంట్ చేశారు. అదే నంబర్ వచ్చింది. అదే విషయాన్ని ఆమెకు చెప్పి చాలా జాగ్రత్తలు సూచించారు. 9 నెలల తర్వాత నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రిలో డెలివరీ చేశారు. మొత్తం 7 బిడ్డల్ని బయటకు తీశాక గ్రాండ్ సక్సెస్ అనుకున్నారు. కానీ మరో ఇద్దరు బిడ్డలు కడుపులో ఉన్నట్లు కనిపెట్టారు. ఆ పసికందులను కూడా బయటకు తీశారు. ఇలా మొత్తం 9 మంది పసికందులకు ఆమె జన్మనిచ్చింది. కానీ, అంతకు ముందు ఆమెకు చేసిన అల్ట్రాసౌండ్స్‌లో ఏడుగురే కనిపించారు కదా మరి ఇప్పుడు 9 మంది ఎలా వచ్చారు అని డాక్టర్లకు డౌట్ వచ్చింది. పరీక్షించారు. కొత్త విషయం తెలిసింది. తల్లి కడుపులోనే ఓ ప్రదేశంలో అతుక్కొని ఈ పిల్లలిద్దరూ ఉన్నట్లు అర్థమైంది. అలా ఉండటం వల్లే అల్ట్రాసౌండ్స్‌లో కనిపించలేదని తేల్చారు.

ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అక్కడి ప్రభుత్వమే ఆశ్చర్యపోయింది. అంత చిన్న వయసులో ఆమె 9 పిల్లలకు జన్మనివ్వడం అసాధారణ విషయం అని డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు హాలిమాకి ప్రత్యేక స్పెషలిస్ట్ కేర్ అవసరం అని చెప్పారు. పుట్టిన పిల్లల్లో ఐదుగురు ఆడపిల్లలు కాగా.. నలుగురు మగ పిల్లలు. తల్లి, బిడ్డలు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మాలీలోని ఆరోగ్య శాఖ మంత్రి ఫాంటా సిబీ తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం హాలిమా ఆరోగ్యం సంగతి చూసుకోనుంది. ఇలా 9 మంది పిల్లలు పుట్టడం ఒకే తల్లికి ఒకేసారి పుట్టడం అత్యంత అరుదు. చాలా..చాలా అరుదుగా మాత్రమే మహిళలు ఏడుగురు పిల్లలకు జన్మ ఇవ్వగలరు. తొమ్మిది మందికి జన్మ ఇవ్వడం అనేది ఇది మూడోసారి మాత్రమే.


Tags:    

Similar News