దారుణం.. క‌రోనా సోకింద‌ని ఏం చేశాడో తెలుసా?

Update: 2021-05-02 14:52 GMT
క‌రోనా టెర్ర‌ర్ జ‌నాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ వైర‌స్ సోకిందంటే.. ఇక చావే శ‌ర‌ణ్యం అని ఫిక్స్ అయిపోతున్నారు బాధితులు. తాజాగా.. క‌రోనా సోకిన ఒక వ్య‌క్తి, ఇక తాను బ‌త‌లేన‌ని రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది.

విశాఖ జిల్లా క‌సింకోట‌కు చెందిన ఓ వ్య‌క్తిలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబుతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాడు. ఆ ప‌రీక్ష‌ల్లో కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. దీంతో మాన‌సికంగా తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యాడ‌ట‌.

ఇక‌, ఈ వ్యాధి త‌గ్గుముఖం ప‌ట్ట‌ద‌ని భావించాడేమో ఆత్మ‌హ‌త్య‌కు సిద్ధ‌మ‌య్యాడు. తూర్పుగోదావ‌రి జిల్లా తుని రైల్వే స్టేష‌న్ ప‌రిధిలోని బ‌య్య‌వ‌రం వ‌ద్ద రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్థానికుల స‌మాచారం అందుకున్న పోలీసులు వెళ్లి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తుని రైల్వే ఎస్సై అబ్దుల్ మారుప్ మీడియాకు తెలిపారు.




Tags:    

Similar News