దభద్కర్ ధన్యచరితః తన బెడ్ మరొకరికి ఇచ్చాడు.. ప్రాణం వదిలేశాడు!
ఈ ప్రాణం నాకో లెక్క కాదు.. చావంటే భయం లేదు..’ ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. కానీ.. నిజంగా ప్రాణాలు వదిలేసుకోవాల్సి వస్తే ఎంత మంది సిద్ధంగా ఉంటారనేది అనుమానమే. కదల్లేని మనిషికి కూడా ప్రాణం మీద తీపి ఉంటుంది. మరి, అలాంటప్పుడు ‘నేను చనిపోతాను.. వేరే వ్యక్తిని బతికించండి’ అని ఎవరైనా అంటారా?? అనడమే కాదు.. తోటి వ్యక్తికోసం ఆసుపత్రిలో బెడ్ వదిలేశాడు. ఇంటి వద్ద ప్రాణాలు వదిలేశాడో వ్యక్తి!
కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో.. ఆసుపత్రుల్లో బెడ్ దొరకడం మహా గగనమైపోయిందన్న సంగతి తెలిసిందే. లక్షలాదిగా పోటెత్తుతున్న కొవిడ్ రోగులకు ఆసుపత్రిలో చోటు దక్కట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే నాగ్ పూర్ కు చెందిన 85 సంవత్సరాల ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త దభద్కర్ కొవిడ్ బారిన పడ్డారు.
ఆయనకు కూడా ఎక్కడా బెడ్ దొరకలేదు. అనేక ప్రయత్నాల తరువాత నాగ్ పూర్ లోని ఇందిరా గాంధీ ఆసుపత్రిలో పడక లభించింది. తన మనవడు, కూతురితో కలిసి ఆసుపత్రికి వెళ్లాడు దభద్కర్. బెడ్ పై పడుకోబెట్టిన తర్వాత.. ఆయన అడ్మిషన్ ఫార్మాలిటీలు పూర్తిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే.. 40 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో ఏడుస్తూ.. పరిస్థితి విషమంగా ఉన్న తన భర్తను చేర్చుకోవాలని ఆసుపత్రి అధికారులను వేడుకుంటోంది. కానీ.. బెడ్ లేదని చెప్పి, వారు వెనక్కి పంపిచేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించాడు దభద్కర్. వెంటనే.. తన పడకను ఆ మహిళ భర్తకు త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను త్యాగం చేస్తున్నది పడకను మాత్రమే కాదు.. తన ప్రాణాన్ని కూడా అన్న సంగతి ఆయనకు తెలుసు.
"నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. దాదాపుగా నా జీవితాన్ని గడిపేశాను. కాబట్టి.. నాకు బదులుగా ఈ బెడ్ ను అతనికి ఇవ్వండి. ఇప్పుడు అతని పిల్లలకు అతను కావాలి." అని దభద్కర్ తన మనవడితోపాటు ఆసుపత్రి అధికారులకు చెప్పారు. దీనికి తొలుత ఆయన కూతురు అంగీకరించలేదు. కానీ.. దభద్కర్ తన కూతురికి అర్థం చేయించాడు. చివరకు ఒప్పించాడు.
దీంతో.. నారాయణ్ దభద్కర్ ను ఇంటికి తీసుకెళ్లారు. నివాసానికి వెళ్లిన తర్వాత మూడు రోజులకు ఆయన తుదిశ్వాస విడిచారు. నిజానికి.. పక్కవారి కోసం ప్రాణత్యాగం చేసే మనుషులు ఈ రోజుల్లో ఎంతమంది? అందుకే.. నారాయణ్ త్యాగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.