17 ఏళ్ల బాలికతో 80 ఏళ్ల ముసలోడితో పెళ్లే ఘోరమైతే.. 22 రోజులకే డైవర్స్​!

Update: 2020-11-06 04:45 GMT
ఇండోనేషియా లో బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 15 శాతం మంది అమ్మాయిలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. బాల్యవివాహాలు చేస్తున్న దేశాల్లో ఇండోనేషియా 8 వస్థానంలో ఉన్నది. ఆ దేశంలో ఇటీవల జరిగిన ఓ ఘటన పై యావత్​ ప్రపంచం దుమ్మెత్తి పోస్తున్నది. ఎనబై ఏళ్లు  దగ్గరపడ్డ ఓ వృద్ధుడు 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకోసం కట్నకానుకలు తీసుకున్నాడు. మోజు తిరగానే ఈ బాలికకు డైవర్స్​ ఇచ్చాడు. దీంతో ఆ వృద్ధుడి తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు.  కరోనా లాక్ ​డౌన్​ తో ఆ దేశంలో పేదరికం పెరిగిపోయింది. దీంతో తల్లిదండ్రులు అమ్మాయిలకు పెళ్లి చేసి పంపించేస్తున్నారు.

తాజాగా ఇండోనేషియాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి నోని నావితా గాథ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జకార్తాకు చెందిన 78 ఏళ్ల అబా శర్నా అనే వృద్ధుడు.. తన మనవరాలి వయస్సు ఉండే 17 ఏళ్ల నోనీ నావితాను పెళ్లి చేసుకున్నాడు. వధువరులతోపాటు ఇరు కుటుంబాలూ అంగీకరించాకే పెళ్లి జరిగింది. వరకట్నం కింద నోనీ కుటుంబం ఆ వృద్ధుడికి 50 వేలు రూపియాలతోపాటు ఒక మోటార్ సైకిల్, పరుపు, సోఫా సెట్ తదితర వస్తువులను సమర్పించుకున్నారు. 17 ఏళ్ల నోనీతో పెళ్లయిన 22 రోజులకే ఆమెతో సంసారం చేయడం ఇష్టం లేదంటూ శర్నా విడాకుల పత్రాలు పంపించాడు. అవి చూడగానే నోనీ కుటుంబ సభ్యులు షాకయ్యారు. బాల్యవివాహాలను రూపుమాపాలని అబాశర్మా లాంటి కఠినంగా శిక్షించాలని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కోరుతున్నారు.
Tags:    

Similar News