16 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల తాత అత్యాచారం !
సమాజంలో రోజురోజుకి ఆడపిల్లలకి అసలు రక్షణే లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆడవారికి రక్షణగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా , ఎంతమంది పోలీసులు గస్తీ కాస్తున్నా కూడా కామాంధులు మాత్రం లెక్కచేయడం లేదు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు తెగబడుతూనే ఉన్నారు. ఒకవైపు ఆడవారిపై అఘాయిత్యం చేసే వారికీ విధించే కఠిన శిక్షలు చూస్తూ మరోవైపు అత్యాచారాలకి పాల్పడుతున్నారు. హత్రాస్ ఘటన మరువకముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ బాలిక పై ముగ్గురు నిందితులు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ ముగ్గురు నింధుతుల్లో 72ఏళ్లు వృద్ధుడు కూడా ఉండడం గమనార్హం. కాటికి కాలు జాపి కూర్చున్న ఈ సమయంలో కూడా కామంతో వృద్ధుడు చేసిన ఆ పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో జరిగింది.
అధికారులు తెలిపిన కథనం ప్రకారం..ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్కు చెందిన ఓ యువతిని ప్రలోభాలకు గురి చేసి ముగ్గురు వ్యక్తులు కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంతలో ఆ యువతి గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీనితో కుటుంబ సభ్యులు ఆ బాలికని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆ బాలిక అత్యాచారానికి గురైందని, గర్భం దాల్చిందని తెలిపారు. దీంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు , అసలు ఏంజరిగిందో చెప్పమని బాలికని అడగ్గా తీయగా అసలు విషయాన్ని తెలిపింది. అనంతరం బాధిత యువతి వాట్సాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో మహిళా పోలీసు అధికారి నేతృత్వంలోని ప్రత్యేక బృందం యువతి ఇంటికి చేరుకుని వివరాలు సేకరించింది. తనపై ముగ్గరు వ్యక్తులు రేప్ చేయగా, అందులో ఇద్దరు ఏడాదిన్నరగా పలుమార్లు తనను అత్యాచారం చేశారని , అలాగే 72 ఏళ్ల వృద్ధుడు కూడా తనపై పలుమార్లు అత్యాచారం చేసాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.