8 ఏళ్ల బాలికపై 7 టీనేజర్ల అత్యాచారం !
త్రిపురలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏడుగురు టీనేజ్ బాయ్స్ 8 ఏళ్ల ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దాగుడు మూతలు ఆడుకుందామని పిలిచి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. క్యాజువల్‌గా ఆ పాప వెళ్లింది. అంతే... ఏడుగురూ కలిసి... ఆ మూడో తరగతి బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ... పశ్చిమ త్రిపుర జిల్లాలోని తబారియా గ్రామానికి చెందిన ఏడుగురు టీనేజర్స్ శుక్రవారం అదే గ్రామానికి చెందిన ఓ మూడో తరగతి విద్యార్థినిని దాగుడు మూతలు ఆడుకుందామని పిలిచారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి తిరిగొచ్చిన బాలిక తల్లిదండ్రులతో అసలు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసులో నిందితులైన ఏడుగురు టీనేజర్స్ ఆ బాలికకు పరిచయస్తులేనని గుర్తించారు. ఇందులో ఆరుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన ఆరుగిరిలో నలుగురిని పోలీసులు జువెనైల్ హోమ్‌కి తరలించారు. మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. వాళ్లను ట్రీట్‌మెంట్ కోసం ఆస్పత్రిలో చేర్పించారు. పాపకు కరోనా సోకిందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
12 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు నిందితులకు కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఘటన పై తమకు శనివారం ఫిర్యాదు అందిందని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ప్రియా మాధురి మజుందార్ తెలిపారు. ఆ చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వాళ్లంతా పాపకు తెలుసు. అందువల్లే పాప వాళ్లతో వెళ్లింది. కనీసం ఇలా ఆడుకోవడానికి వెళ్తున్నానని మాకు చెప్పనైనా చెప్పలేదు" అని పాప తల్లిదండ్రులు తెలిపారు. ఆ బాధితురాలి ఫ్యామిలీ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.