మోడీ రద్దు చేస్తానని చెప్పిన 3 వ్యవసాయ చట్టాల్లో ఏముంది?
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరగటంతో పాటు.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి సాగిన వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం ఎట్టకేలకు విజయం సాధించింది. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని గళమెత్తిన రైతాంగం డిమాండ్ కు మోడీ సర్కారు తలొగ్గలేదనే చెప్పాలి. నిరసన ప్రారంభించిన రోజుల్లో ఉద్యమం చేస్తున్న రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ససేమిరా అన్న ప్రభుత్వం.. తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో పూర్తిగా దిగి రావటమే కాదు.. తాజాగా చట్టాల్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేయటం తెలిసిందే.
తీవ్రమైన చర్చకు కారణమైన ఈ మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది? అందులోని అంశాలేమిటి? అన్న విషయాల్లోకి వెళితే..
మొదటి చట్టం.. రైతు ఉత్పత్తుల వాణిజ్య.. వ్యాపార చట్టం 2020
- వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ మార్కెట్లకు బయట కూడా రైతులు తమ ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను ఇస్తుంది. అలా చేసే అమ్మకాల మీద ఎలాంటి రుసుములు విధించకూడదు. ప్రత్యామ్నాయ విక్రయ మార్గాలు అందుబాటులో ఉండటంతో నచ్చిన చోట.. తమకు ఎక్కడ ఎక్కువ ధరకు రైతులు పంటను అమ్ముకోవాలో.. అక్కడ అమ్ముకునే అవకాశం లభిస్తుంది.
ఈ చట్టం మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకంటే.. కనీస మద్దతు ధర వ్యవస్థకు ఈ చట్టం ముగింపు పలుకుతుందన్నది రైతుల ఆందోళన. ప్రైవేటు కంపెనీలు రైతుల్ని దోచుకోవటానికి ఈ చట్టం ఉపకరిస్తుందని.. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా రైతులు అమ్ముకునే అవకాశాన్ని బడా కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుంటాయని.. అదే జరిగితే తాము తీవ్రమైన నష్టానికి గురి కావాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తమైంది.
రెండో చట్టం.. వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పంద చట్టం 2020
పండించే పంట కొనుగోలుకు సంబందించి వ్యాపార సంస్థలు.. ఎగుమతిదారులతో రైతులు ముందుగానే ఒప్పందం చేసుకునే అవకాశాన్ని ఈ చట్టం ఇస్తుంది. పంట ధరను వారు ముందుగానే నిర్ణయించుకోవచ్చు. మార్కెట్ ధరల్లో ఒడుదొడుకులు ప్రతికూల ప్రభావం రైతుల మీద పడకుండా ఇది రక్షణగా నిలుస్తుందంటూ చట్టాన్ని తెచ్చిన సందర్భంలో పేర్కొంది.
ఈ చట్టంపై రైతులు.. రైతు సంఘాలు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఈ చట్టం పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా దీన్ని ప్రభుత్వం తీర్చిదిద్దినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తాము పండించే పంటలకు సరిపోయే ధరను బేరమాడే అవకాశాన్ని పూర్తిగా తీసేస్తుందన్న భయాందోళనలు వ్యక్తం చేశారు.
మూడో చట్టం.. నిత్యావసర సరుకుల చట్టం 2020
ఈ సవరణ చట్టంలో పప్పులు.. త్రణధాన్యాలు.. నూనెగింజలు.. ఉల్లి.. బంగాళదుంపలు వంటి ఉత్పత్తులునిత్యవసర సరుకుల జాబితా నుంచి తొలగించారు. వాటి ఎగుమతులపై నిల్వ పరిమితి సంబంధిత ఆంక్షలు విధించకూడదని ఈ చట్టం చెబుతోంది. యుద్ధం..కరవు..విపత్తులు.. ధరల్లో అసాధారణ పెరుగుదల లాంటివి తలెత్తినప్పుడు మాత్రమే ఆంక్షలు విధించాలని ఈ చట్టం పేర్కొంది.
ఈ సవరణ చట్టాన్నిచూసినప్పుడు రైతుల కంటే కూడా కార్పొరేట్ కంపెనీలకు.. బడా సంస్థలకు మేలు కలిగించేలా ఉండటం కనిపిస్తోందన్న ఆరోపణ ఉంది. ఈ చట్టం పెద్ద కంపెనీలు భారీగా సరుకుల నిల్వలకు అవకాశాన్ని ఇస్తుందని ఆరోపించటంతో పాటు.. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని తామే డిసైడ్ చేసే స్థాయికి చేరుకోవటం ఖాయమన్న ఆందోళన వ్యక్తమైంది. ఇలా ఈ మూడు చట్టాలపై రైతుల ఆందోళనలో అర్థం లేదని.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మోడీ సర్కారు అదే పనిగా చెప్పినా.. చివరకు రైతుల నిరసనలకు తలొగ్గక తప్పలేదు. చివరకు తాము చేసిన చట్టాల్ని తామే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.