కర్ణాటకలో గల్లంతైన 14మంది ఎమ్మెల్యేలు ఎక్కడ.?

Update: 2018-05-16 09:55 GMT

కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో అధికారం కోసం పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. 104 సీట్లతో ఆగిపోయిన బీజేపీ ఇంకో 8మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసి పోయి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనా ఇప్పుడు వారి ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం హాట్ టాపిక్ గా మారింది.  

జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశం బెంగళూరులోని స్టార్ హోటల్ లో జరిగింది. దీనికి ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. కుమారస్వామి జేడీఎస్ శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యారు. కానీ హాజరుకాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేల కోసం వారి నియోజకవర్గాలకు హెలీక్యాపర్లు పంపించి వెతుకుతున్నారు.

ఇక కాంగ్రెస్ శాసనసభాపక్షానికి భారీ నష్టమే వాటిల్లింది. వారి సమావేశానికి ఏకంగా 12మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మొత్తం 78మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఈ సమావేశానికి 66మంది మాత్రమే హాజరుకావడంతో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంది.

కాంగ్రెస్ కు చెందిన 12మంది - జేడీఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడు ఉన్నారనే దానిపై ఆరాతీస్తున్నారు. ఓవైపు బీజేపీ యడ్యూరప్ప సీఎంగా ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ - జేడీఎస్ మాత్రం తప్పిపోయిన ఎమ్మెల్యేల కోసం ఆరాతీస్తోంది. ఇలా కన్నడనాట ఎమ్మెల్యేల గల్లంతు వార్తలు  ఆసక్తి రేపుతున్నాయి.
Tags:    

Similar News