100 కోట్ల డోసులు.. ప్రపంచానికే భారత్ ఆదర్శం: మోదీ

Update: 2021-10-22 10:30 GMT
అక్టోబర్ 21 నాటికి భారతదేశం ఒక బిలియన్ (100 కోట్లు) కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను అందించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత చరిత్రలో ఇది కొత్త అధ్యాయానికి నాంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

"100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించడం కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఇది చరిత్రలో కొత్త అధ్యాయం. భారతదేశం కఠినమైన లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలదనే దానికి నిదర్శనం. దేశం తన లక్ష్యాల నెరవేర్పు కోసం కష్టపడి పనిచేస్తుందని ఇది చూపిస్తుంది. భారతదేశం   మొత్తం టీకా కార్యక్రమం ఎంతో పకడ్బందీగా జరిగినందుకు  మనం గర్వపడాలి. ఇది పూర్తిగా శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. టీకా విజయవంతానికి కృషి చేసిన ప్రజలకు ధన్యవాదాలు ”అని మోదీ అన్నారు.

ప్రధాని ఈ టీకా గొప్ప పంపిణీని ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదాన్ని పోల్చారు. "భారత దేశంలో తయారు చేసిన టీకా కార్యక్రమం పట్ల భయాందోళనలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని ప్రజలు రూపుమాపారు. భారతదేశ ప్రజలు ఇంత సహనాన్ని ప్రదర్శించి వంద కోట్లు డోసులు వేసుకోవడం గర్వకారణం.. ఈ వ్యాక్సిన్ ఫీట్ వెనుక 130 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఈ విజయం భారతదేశం.. ప్రతి భారతీయుడిది "అని మోదీ ప్రశంసించారు.

ఇంత భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో భారతదేశం ప్రపంచానికి దిక్సూచీగా మారిందని ప్రధాని ప్రశంసించాడు. మనం వేసుకోవడంతోపాటు ప్రపంచానికి టీకాలు ఎగుమతి చేశామన్నారు. మన దేశం ఫార్మాకు కేంద్రంగా ఉందని ఇప్పుడు ప్రపంచం కూడా అంగీకరిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News