శవ పేటికలో శృంగారం!

Update: 2015-12-04 10:57 GMT
కొంతమందిలో పిచ్చి ముదిరిపోతోంది. ఏం చేస్తున్నామో కూడా తెలీని ఉన్మాద స్థితిలో చేస్తున్న కొన్ని ఘటనలు సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియా పుణ్యమా అని బయటకు వస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఒక జంట చేసిన పాడు పనిపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. కామ పిశాచుల్లా వ్యవహరించి వారు చేసిన శృంగారం మీద మండిపాటు వ్యక్తమవుతోంది. సెక్స్ చేయటానికి మరెక్కడా స్థలం దొరకలేదేమో కానీ.. శవపేటికలు ఉంచిన గదిలోకి వచ్చిన వారు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కెమేరా కంటికి దొరికిపోయారు. గదిలో కాసేపు గడిపిన వారు తట్టుకోలేని కామంతో.. శవ పేటికలోకి దూరి శృంగారం జరిపారు. ఈ వ్యవహారం కెమేరా కంటికి చిక్కి.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఈ దరిద్రపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండ్నిమిషాల సుఖం కోసం మరీ అంతగా కక్కుర్తి పడాలా..?
Tags:    

Similar News