• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  ఈషా కిల్లింగ్ లుక్స్..!

ఈషా కిల్లింగ్ లుక్స్..!

| బ్రౌన్ కలర్ డిజైనింగ్ షర్ట్.. డెనిమ్ షార్ట్ తో బీచ్ ఒడ్డున ఈషా లుక్ అదిరిపోయింది.

By - Tupaki Desk
Update: 2023-07-25 09:55 GMT

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ సినిమాల వేగం తగ్గినా తన ఫోటో షూట్స్ తో మాత్రం ఆడియన్స్ ని అలరిస్తుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈషా ఆ సినిమా హిట్ అవడంతో వరుస అవకాశాలు అందుకుంది. స్టార్ ఛాన్స్ ల విషయంలో ఆమె వెనక పడింది. 15 సినిమాల కెరీర్ లో ఎన్.టి.ఆర్ అరవింద సమేతలో మాత్రమే ఆమె హీరోయిన్ సిస్టర్ పాత్ర చేసింది ఈషా రెబ్బ. సోలో హీరోయిన్ గా ఛాన్స్ లు రాకపోవడంతో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను కూడా చేస్తూ వచ్చింది అమ్మడు.




 


ఓటీటీల్లో వెబ్ సీరీస్ లతో కూడా ఆడియన్స్ ని మెప్పించాలని ప్రయత్నించింది ఈషా రెబ్బ. 3 రోజెస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ సీరీస్ లలో కూడా నటించింది. సినిమాలు, వెబ్ సీరీస్ లు ఎలా ఉన్నా ఈమధ్య ఫోటో షూట్స్ తో ఈషా హంగామా చేస్తుంది. ఈ క్రమంలో ఈషా లేటెస్ట్ లుక్స్ కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తుంది. బ్రౌన్ కలర్ డిజైనింగ్ షర్ట్.. డెనిమ్ షార్ట్ తో బీచ్ ఒడ్డున ఈషా లుక్ అదిరిపోయింది.




 


ఈషా ఫోటో షూట్స్ గురించి ఈమధ్య సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గ్లామర్ విషయంలో ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చేయని ఈషా తన ఓర చూపులతోనే ఫాలోవర్స్ ని తన బుట్టలో వేసుకుంటుంది.

ఈషా రెబ్బ బీచ్ సైడ్ ఫోటోస్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లకపోయినా తెలుగులో 15 సినిమాలు 3 వెబ్ సీరీస్ లతో ఈషా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకుంది.

ఈమధ్య సినిమాల విషయంలో దూకుడు తగ్గించినట్టు కనిపిస్తున్నా వస్తున్న అవకాశాన్ని మాత్రం కాదనకుండా చేస్తుంది. ఇక రీసెంట్ గా తమిళంలో ఒక ఆఫర్ అందుకున్న అమ్మడు అక్కడ కెరీర్ కొనసాగించాలని చూస్తుంది. తెలుగులో అయితే ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న మామా మశ్చీంద్ర సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. మామా మశ్చీంద్ర అయినా ఈషా కి మంచి హిట్ అందిస్తుందేమో చూడాలి. టాలీవుడ్ లో గొప్పగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేస్తుంది ఈషా రెబ్బ. అంతకుముందు మలయాళంలో కూడా రెండు సినిమాలు చేసిన ఈషా అక్కడ సినిమా ప్రయత్నాల్లో కూడా ఉందని టాక్.

Tags:    
  • Esharebba 
  • Actress 
  • PhotoTalk 
  • Stunninglooks 
  • Poses 
  • GorgeousStills 

Similar News

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

వైట్ గ్లామర్‌తో మాళవిక మోహనన్.. చూపు తిప్పుకోలేరు!

2026-11-01 07:50 GMT

ధ్రువ్ విక్రమ్.. ఈ క్రేజ్‌కు ఆ స్పీడ్ లేదే!

2026-11-01 04:35 GMT

పండుగ వేడుకల్లో జాన్వీ కపూర్.. లగ్జరీ యాక్సెసరీతో మెరుపులు!

2026-10-31 13:30 GMT

వండర్ ఉమెన్‌గా ఖుషీ కపూర్.. హాలోవీన్ లుక్ అదుర్స్!

2026-10-31 10:30 GMT

44 వ‌య‌సు అంటే న‌మ్మేదెలా శ్రీ‌యా?

2026-10-31 08:02 GMT

క్యాజువల్ లుక్‌లో కుషిత.. స్టైల్ అదుర్స్!

2026-10-31 07:18 GMT

పిక్‌టాక్‌ : చక్కనమ్మ చిక్కిందా ఏంటి?

2026-10-30 01:30 GMT

రాయల్ ఫ్రేమ్‌లో పాలక్.. గ్లామర్ ఓకే కానీ..

2026-10-29 23:30 GMT

పిక్‌టాక్‌ : ఎరుపెక్కిన నివేదా అందం

2026-10-29 19:30 GMT

క‌త్రిన‌ను అందుకే దేవ‌తాసుంద‌రిగా ఆరాధిస్తారు!

2026-10-28 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS