• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  అరియానాతో మిస్టర్...

అరియానాతో మిస్టర్ ప్రెగ్నెంట్.. స్టైలిష్ డోస్

| యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన అందాల భామ అరియానా గ్లోరీ.

By - Tupaki Desk
Update: 2023-08-20 05:32 GMT

యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన అందాల భామ అరియానా గ్లోరీ. ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యాక్టర్ గా, మోడల్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా రాణిస్తోంది. టీవీ షోలలో యాంకర్ గా కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. ఆర్జీవీతో చేసిన హాట్ ఇంటర్వ్యూలు అరియానాకి బోల్డ్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి.


బిగ్ బాస్ చరిత్రలో రెండు సార్లు పార్టిసిపేట్ చేయడంతో పాటు షో తరువాత నిర్వహించే టాక్ షోలకి హోస్ట్ గా వ్యవహరించిన ఘనత ఈ బ్యూటీ సొంతం. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాజిటివ్ టాక్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. మెల్లగా మౌత్ టాక్ తో ప్రేక్షకాదరణ పెరుగుతోంది.


ఈ సినిమా ప్రమోషన్స్ లో అరియానా కూడా భాగం అయ్యింది. సోహైల్ తో దిగిన ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. హలో మిస్టర్ ప్రెగ్నెంట్ అని క్యాప్షన్ ఇచ్చి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో అరియానా థైస్ అందాలు చూపిస్తూ షార్ట్ డ్రెస్ తో అదిరిపోతోంది. వీరిద్దరి జోడీ ఫోటోలని చూసిన నెటిజన్లు మాత్రం ఆసక్తిగా రెస్పాండ్ అవుతున్నారు.


మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయొచ్చుగా అని కొంత మంది కామెంట్స్ చేయగా, మీ జోడి బాగుంది ఇద్దరు పెళ్లి చేసుకోండి అంటూ మరికొంత మంది సలహాలు ఇస్తున్నారు. అదే సమయంలో కొంతమంది మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చాలా బాగుందని సోహైల్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో నుంచి సోహైల్, అరియానా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

ఇప్పటికి వారు అదే రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలిసినపుడు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటారు. అంతలోనే కలిసిపోయి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు సోహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ రిలీజ్ కావడంతో తనవంతుగా అరియానా కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తూ ఉంది.

Tags:    
  • AriyanaGlory 
  • PhotoStory 
  • Syedsohelryan 
  • Mrpregnent 
  • Tollywood 
  • MovieNews 

Similar News

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

వైట్ గ్లామర్‌తో మాళవిక మోహనన్.. చూపు తిప్పుకోలేరు!

2026-11-01 07:50 GMT

ధ్రువ్ విక్రమ్.. ఈ క్రేజ్‌కు ఆ స్పీడ్ లేదే!

2026-11-01 04:35 GMT

పండుగ వేడుకల్లో జాన్వీ కపూర్.. లగ్జరీ యాక్సెసరీతో మెరుపులు!

2026-10-31 13:30 GMT

వండర్ ఉమెన్‌గా ఖుషీ కపూర్.. హాలోవీన్ లుక్ అదుర్స్!

2026-10-31 10:30 GMT

44 వ‌య‌సు అంటే న‌మ్మేదెలా శ్రీ‌యా?

2026-10-31 08:02 GMT

క్యాజువల్ లుక్‌లో కుషిత.. స్టైల్ అదుర్స్!

2026-10-31 07:18 GMT

పిక్‌టాక్‌ : చక్కనమ్మ చిక్కిందా ఏంటి?

2026-10-30 01:30 GMT

రాయల్ ఫ్రేమ్‌లో పాలక్.. గ్లామర్ ఓకే కానీ..

2026-10-29 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS