బ్రిటన్‌లో తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్.. రీజనేంటి?
ఒకవైపు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే భారత విద్యార్థులను ఏదో ఒంక పెట్టి వెనక్కు పంపేస్తున్నా రు.;
ఒకవైపు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే భారత విద్యార్థులను ఏదో ఒంక పెట్టి వెనక్కు పంపేస్తున్నా రు. అసలు వీసా దక్కడమే గగనంగా మారింది. ఇలాంటి సమయంలో మరో అభివృద్ధి చెందిన దేశం బ్రిటన్‌లోనూ భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని.. స్వయంగా ఆదేశమే ప్రకటించింది. ప్రస్తుత సంవత్సరంలో 11 శాతం మంది(వందకు 11 మంది) తగ్గినట్టు బ్రిటన్ హోం శాఖ వెల్లడించింది. ఈ మేరకు కొన్ని లెక్కలను కూడా వెలువరించింది.
ఈ లెక్కల ప్రకారం.. విద్యార్థి వీసాలు పొందుతున్న దేశాల్లో ఒకప్పుడు భారత్ ముందు వరుసలో ఉండగా.. ఇప్పుడు ఈ స్థానాన్ని చైనా ఆక్రమించింది. దీంతో భారత్ ఈ ఏడాది రెండో స్థానానికి పరిమితం అయింది. ఇక, ఈ ఏడాది జూన్ నెలకు.. 98 వేల 14 మంది ఇండియన్ స్టూడెంట్స్ బ్రిటన్‌లో చదువుకునేందుకు వీసాలు దక్కించుకున్నారు. అదేసమయంలో చైనా నుంచి చదువుకునేందుకు వచ్చేవారు.. ఏకంగా 99 వేల 919 వీసాలను సొంతం చేసుకున్నారు.
అంటే.. భారత విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నది బ్రిటన్ చెప్పిన గణాంకాలను బట్టి స్పష్టమవు తోంది. అయితే.. ఇది మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. చైనా నుంచి వెళ్లేవారి సంఖ్య కూడా.. 7 శాతం తగ్గిందట. గత ఏడాది సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు చైనా నుంచి బ్రిటన్ వెళ్లి చదువుకుం టే.. ఈఏడాది వందకు ఏడుగురుచొప్పున తగ్గారని వివరించింది. మరోవైపు.. వీసాలేకుండానే బ్రిటన్ లోకి అడుగు పెడుతున్న వారిపై దేశం నిఘా పెంచింది.
ఇలా.. అడ్డ దారుల్లో బ్రిటన్‌లోకి వచ్చిన 2వేల 715 మంది ఇండియన్ స్టూడెంట్స్‌ను అరెస్టు చేసి.. తర్వాత బెయిల్‌పై వదిలేసినట్టు వెల్లడించింది. గత ఏడాది నుంచి వర్క్ వీసాలను తగ్గించేయడంతో అక్రమ మార్గంలో వచ్చేవారు తగ్గారని బ్రిటన్ వెల్లడించింది.
విద్యార్థులు తగ్గడానికి రీజనేంటి?
+ బ్రిటన్‌కు భారత విద్యార్థులు తగ్గడానికి ప్రధాన కారణం.. ఇంగ్లీష్.
+ రెండేళ్ల నుంచి బ్రిటన్‌లో కొత్త రూల్స్ అమల్లో ఉన్నాయి.
+ ఆదేశంలో చదువుకునేవారు.. అధికారిక ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సంపాయించాలి.
+ దీనికి సంబంధించి విద్యార్థులు దేశంలోకి అడుగు పెట్టడానికి ముందే పరీక్ష పెట్టి.. దానిలో ఉత్తీర్ణత సాధిస్తేనే వీసా ఇస్తున్నారు.
+ ఈ పరీక్ష భారతీయ విద్యార్థులకు కొరుకుడు పడడం లేదు. ఢిల్లీలో వీటి కోసం కోచింగ్ సెంటర్లు కూడా వెలిశాయి.
+ ఇక, సునాక్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ విద్యార్థుల ఫీజులను రెండింతలు చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా ఇలా పెంచామని సమర్థించుకున్నారు.
+ ద్రవ్యోల్బణం కారణంగా కూడా బ్రిటన్ లో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా మారింది. ఈ కారణాలతోనే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్న చర్చ ఉంది.