హెచ్‌-1బీ దుర్వినియోగం వ్యవహారం... ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!

హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ అత్యంత స్ట్రిక్ట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-11-08 10:20 GMT

హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ అత్యంత స్ట్రిక్ట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలు వీలు కల్పించే హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ట్రంప్ సర్కార్ విస్తృత చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వీసా అవకతవకలపై దర్యాప్తు ప్రారంభించిన కార్మిక శాఖ 175 కేసులు నమోదు చేసింది.

అవును... హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని, అందువల్ల విదేశీ కార్మికులతో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని ట్రంప్ సర్కార్ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. కార్మిక శాఖ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా 'ఎక్స్' పోస్ట్ లో... అమెరికన్ ఉద్యోగాలను రక్షించాలనే తమ లక్ష్యంలో భాగంగా, హెచ్-1బీ దుర్వినియోగంపై 175 దర్యాప్తులను ప్రారంభించినట్లు తెలిపింది.

ఇదే సమయంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కార్మిక కార్యదర్శి లోరీ చావెజ్-డిరెమెర్ నాయకత్వంలో అమెరికన్ కార్మికులు మొదట రావాలని నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటూనే ఉంటామని ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ దర్యాప్తునకు సంబంధించిన వివరాలను మాత్రం ఇంకా బయటపెట్టలేదు.

హెచ్-1బీ దుర్వినియోగం సూచికలు!:

అమెరికా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ అయిన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూ.ఎస్.సీ.ఐ.ఎస్).. హెచ్-1బీ కార్యక్రాంలో మోసానికి సంబంధించిన అనేక సూచికల జబితాను వెల్లడిచింది. ఇందులో భాగంగా... కార్మికులకు ధృవీకరించబడిన వేతనం కంటే తక్కువ చెల్లించడం లేదా జీతం లేకుండా వారిని బెంచింగ్ చేయడం వంటివాటికి పాల్పడటం.

ఇదే సమయంలో... హెచ్-1బీ, ఒకేలాంటి పని చేస్తున్న అమెరికా ఉద్యోగుల మధ్య వేతన అసమానతలు చూపించడం.. అందుబాటులో ఉన్న అమెరికన్ ఉద్యోగుల కంటే తక్కువ అనుభవం ఉన్న హెచ్-1బీ కార్మికులను నియమించడం.. వంటివాటిని పొందుపరిచింది!

ఇదే సమయంలో... ఉన్నత డిగ్రీలు పొందిన కొంతమంది విదేశీ కార్మికులకు ఉద్యోగ వివరణలో ప్రమోట్ చేయబడిన దానికంటే చాలా తక్కువ జీతం చెల్లించబడిందని.. ఇది వీసా హోల్డర్లు, అమెరికన్ కార్మికులకు వేతనాలను తగ్గిస్తుందని.. అదేవిధంగా పోటీతత్వాన్ని కొనసాగించడానికి అదే అర్హత కలిగిన అమెరికన్ ఉద్యోగులు తక్కువ వేతనాలను అంగీకరించమని బలవంతం చేస్తుందని కార్మిక శాఖ పేర్కొంది.

సెప్టెంబర్ లో ట్రంప్ ప్రకటన!:

కాగా... సెప్టెంబర్ 19న వైట్ హౌస్ వెబ్‌ సైట్‌ లో విడుదల చేసిన అధ్యక్ష ప్రకటనలో.. అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను తీసుకురావడానికి ఉద్దేశించిన హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్.. అమెరికన్ కార్మికులను తక్కువ జీతం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా దోపిడీ చేయబడిందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News