• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  అమెరికాలో భారతీయ...

అమెరికాలో భారతీయ విద్యార్థులపై మరో పిడుగు

| ఈ చట్టం OPT (Optional Practical Training) , STEM OPT వీసాలపై పనిచేస్తున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న FICA (Federal Insurance Contributions Act) పన్ను మినహాయింపును రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది.

By - A.N.Kumar
Update: 2025-10-28 07:50 GMT

అమెరికాలో ఉన్న భారత విద్యార్థులకు మరో కొత్త ఆర్థిక భారం పడే ప్రమాదం పొంచి ఉంది. సెనేటర్ టామ్ కాటన్ ప్రతిపాదించిన 'OPT ఫెయిర్ ట్యాక్స్ యాక్ట్ ’ అనే చట్టం ఆమోదం పొందితే.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న వేలాది మంది విదేశీ విద్యార్థులపై, ముఖ్యంగా భారతీయులపై, తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చట్టం OPT (Optional Practical Training) , STEM OPT వీసాలపై పనిచేస్తున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న FICA (Federal Insurance Contributions Act) పన్ను మినహాయింపును రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది.

* OPT వీసా విద్యార్థులకు అదనపు పన్ను భారం

ప్రస్తుతం, FICA పన్ను నుంచి OPT విద్యార్థులకు మినహాయింపు ఉంది. ఈ పన్ను కింద ఉద్యోగులు.. యజమానులు మొత్తంగా 7.65% (6.2% సోషల్ సెక్యూరిటీకి + 1.45% మెడికేర్‌కి) చెల్లించాలి. కొత్త చట్టం ఆమోదం పొందితే OPT లేదా STEM OPT మీద పనిచేస్తున్న విద్యార్థులు తప్పనిసరిగా తమ జీతంలో 7.65% పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా వారి వార్షిక ఆదాయం వేల డాలర్లు తగ్గిపోతుంది.

* అమెరికన్ కార్మికుల రక్షణ వర్సెస్ విద్యార్థుల ఆందోళన

ఈ ప్రతిపాదనను సెనేటర్ కాటన్ సమర్థిస్తూ పన్ను మినహాయింపును తొలగించడం ద్వారా అమెరికన్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, అమెరికన్ కార్మికులను ప్రోత్సహించడం తమ పన్ను విధానం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు.

అయితే ఈ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. OPT వీసా విద్యార్థులకు సోషల్ సెక్యూరిటీ లేదా మెడికేర్ వంటి ప్రయోజనాలు పొందే హక్కు లేదు. ప్రయోజనాలు పొందని వారికి పన్ను విధించడం అన్యాయం అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మేము పొందలేని ప్రయోజనాల కోసం మా జీతం నుంచి 7.65% కోల్పోవడం అన్యాయం. ఇది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడంకన్నా మాపై అదనపు భారమే,” అని ఒక భారత విద్యార్థి స్పందించారు.

* భారత విద్యార్థులపై బహుముఖ ప్రభావం

అమెరికాలో OPT లేదా STEM OPT వీసాలతో పనిచేస్తున్న విద్యార్థులలో భారతీయుల సంఖ్యే అధికం. ఈ చట్టం ముఖ్యంగా వారిపై ఈ కింది విధంగా ప్రభావం చూపిస్తుంది. ప్రతి విద్యార్థి తమ వార్షిక ఆదాయంలో 7.65% కోల్పోవడం వల్ల వారి ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి. ఉద్యోగులు మరియు కంపెనీలు ఇద్దరూ FICA పన్ను చెల్లించాల్సి రావడం వల్ల, కంపెనీలు OPT విద్యార్థులను నియమించడంలో ఆసక్తి తగ్గించుకోవచ్చు. ఎందుకంటే, కంపెనీలకు కూడా ఇప్పుడు అదనపు పన్ను భారం పడుతుంది. అమెరికాలో ఉద్యోగం పొందడం మరింత కఠినతరం అవుతుంది.

* దీర్ఘకాలిక పరిణామాలు

అమెరికాలో విద్య ఖర్చులు ఇప్పటికే అత్యధికంగా ఉన్నాయి. OPT సమయంలో ఉద్యోగం ద్వారా కొంతవరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని భావించే భారతీయ విద్యార్థులకు ఈ అదనపు పన్ను పెద్ద ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తుంది.

దీర్ఘకాలంలో ఈ చట్టం ఆమోదం పొందితే, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదన భారత విద్యార్థుల ఆర్థిక వ్యవస్థపై, అమెరికాలో వారి ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపగలదని భావించవచ్చు.

Tags:    
  • usnews 
  • optfairtaxact 
  • indianstudents 
  • fica 
  • taxnews 

Similar News

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వ్యాపారవేత్త మృతి

2026-11-07 04:00 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

Copyright @2026

Powered by Blink CMS