• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  కోపంతో ప్రియురాలిని చంపిన...

కోపంతో ప్రియురాలిని చంపిన ఎన్నారై... ట్విస్ట్ ఇదే!

| ఈ సమయంలో గొడవ మరింత తీవ్రమవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సిమ్రన్ జిత్ సింగ్... కారులో నుంచి తుపాకీ తీశాడు.

By - Tupaki Desk
Update: 2023-08-27 11:11 GMT

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొంతమంది మగ్గింగ్ కి పాల్పడుతుంటే.. మరికొందరు ప్రతీ చిన్న విషయానికీ గన్ బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన గర్ల్‌ ఫ్రెండ్ పై తుపాకీతో కాల్చాడు ఎన్నారై.

అవును... అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని క్యాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న సిమ్రన్‌ జిత్ సింగ్ అనే వ్యక్తికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా శనివారం తన గర్ల్‌ ఫ్రెండ్‌ ను తీసుకొని ఓ షాపింగ్ మాల్‌ కు వెళ్లాడు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ సరదాగా గడిపారు!

ఆ తర్వాత కాసేపటికి షాపింగ్ ముగిసింది. ఈ సందర్భంగా ఇద్దరూ షాపింగ్ లగేజ్ తీసుకుని కారు పార్కింగ్ వద్దకు వెళ్లారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ... ఇద్దరి మధ్య చిన్న గొడవ స్టార్ట్ అయ్యింది. అది కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. దీంతో సిమ్రన్ జిత్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఈ సమయంలో గొడవ మరింత తీవ్రమవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సిమ్రన్ జిత్ సింగ్... కారులో నుంచి తుపాకీ తీశాడు. తన గర్ల్ ఫ్రెండ్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరిణించింది.

అప్పటికి ఆగ్రహం చల్లారిందో ఏమో.. కోపం నుంచి తేరుకున్న సిమ్రన్ జిత్... అక్కడనుంచి పారిపోయాడు. కాసేపటికి పార్కింగ్ ప్లేస్ లో ఒక మహిళ డెడ్ బాడీ ఉందనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అనంతరం డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఈ హత్యకు గల కారణాలను వెతికే పనిలోపడ్డారు. ఇందులో భాగంగా... పార్కింగ్ ప్లేస్‌ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ స్టోర్ వద్ద అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే... ఇండియన్ ఆరిజన్ అయిన సిమ్రన్ జిత్ సింగ్ వయసు 29ఏళ్లు కాగా... అతని గర్ల్ ఫ్రెండ్ వయసు 34 ఏళ్లు!

Tags:    
  • America 
  • Gunculture 
  • Simranjitsingh 
  • California 
  • Nri 
  • Crime 
  • Politicalnews 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

Copyright @2026

Powered by Blink CMS