• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  అమెరికాలో మరో...

అమెరికాలో మరో ‘జయ్’కేతనం..నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌

| తాజాగా అమెరికాలో భారత సంతతి వ్యక్తి మరో ఉన్నత పదవి పొందారు. అగ్రరాజ్యంలో బాగా డిమాండ్ ఉండేది హెల్త్ కేర్ రంగం.

By - Tupaki Desk
Update: 2025-03-26 10:56 GMT

అక్షరాలా అరకోటి.. అమెరికాలో భారత సంతతి జనాభా ఇది. వీరేకాక భారతీయ మూలాలున్న వారు లెక్కలేనంత మంది.. వీరిలో ఉన్నత హోదాల్లో ఉన్నవారూ చాలమంది.. అగ్ర రాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ నుంచి ప్రసిద్ధ వ్యోమగామి సునీతా విలియమ్స్ వరకు.. భారతీయులు రాణించని రంగం అంటూ అమెరికాలో లేదు. టెక్ ప్రపంచాన్ని శాసించే గూగుల్ అధిపతి సుందర్ పిచయ్.. ట్రంప్ చేపట్టిన అధికార వ్యవస్థ ప్రక్షాళన డోజ్ లో వివేక్ రామస్వామి వరకు.. అగ్రరాజ్యంలో భారతీయుల హవా మామూలుగా లేదు.

తాజాగా అమెరికాలో భారత సంతతి వ్యక్తి మరో ఉన్నత పదవి పొందారు. అగ్రరాజ్యంలో బాగా డిమాండ్ ఉండేది హెల్త్ కేర్ రంగం. ఇప్పుడు భారత మూలాలున్న జయ్‌ భట్టాచార్యకు ఈ రంగంలో ఉన్నత పదవి దక్కింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ డైరెక్టర్‌గా భట్టాచార్య ఎన్నికైనట్లు యూఎస్‌ సెనెట్ ధ్రువీకరించింది.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌)కు తదుపరి డైరెక్టర్‌ గా జయ్ భట్టాచార్య వ్యవహరించనున్నారు. ఇది వైద్య పరిశోధనలను పర్యవేక్షించే సంస్థ. ఇప్పటికే నవంబరులోనే ట్రంప్ ప్రకటన చేశారు.

ట్రంప్‌ ప్రకటనపై భట్టాచార్య స్పందించారు. తనను తదుపరి ఎన్‌ఐహెచ్‌ డైరెక్టర్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తామని ప్రకటించారు.

భట్టాచార్య 1968లో కోల్‌ కతాలో జన్మించారు. 1997లో స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లో డాక్టరేట్‌ పొందారు. మూడేళ్ల తర్వాత అక్కడే ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ అందుకున్నారు. స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్శిటీలో హెల్త్‌ పాలసీ ప్రొఫెసర్‌, నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ లో రీసెర్చ్‌ అసోసియేట్‌ గా విధులు నిర్వహించారు.

అమెరికాను కుదిపేసిన కొవిడ్ సమయంలో అప్పటి బైడైన్ ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఇద్దరు విద్యావేత్తలతో కలిసి గ్రేట్‌ బారింగ్టన్‌ డిక్లరేషన్‌ ను ప్రచురించారు.

ట్రంప్ ప్రభుత్వంలో 71 ఏళ్ల రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌.. ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. ఈయన మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ వారసుడు. కొవిడ్ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన రాబర్ట్ తో కలిసి జయ్ భట్టాచార్య పనిచేయాల్సి ఉంటుంది.

Tags:    
  • JayBhattacharya 
  • IndianAmericans 
  • NIH 
  • HealthcareLeadership 
  • TrumpAppointments 
  • USHealthcare 
  • IndianRoots 
  • IndianDiaspora 
  • HealthcarePolicy 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

ట్రంప్ అండతో రామస్వామి దూకుడు.. ఓహియో ఎన్నికల్లో వ్యక్తిగత దాడులే కీలకమవుతున్నాయా?

2026-10-23 05:17 GMT

అమెరికా నుంచి భారత్‌కు ఐటీ ఉద్యోగుల రివర్స్ జర్నీ.. 9 నెలల్లో 12,700 మంది వెనక్కి!

2026-10-22 04:23 GMT

Copyright @2026

Powered by Blink CMS