• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  50 సార్లు తలపై సుత్తెతో...

50 సార్లు తలపై సుత్తెతో బాది... అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ హత్య!

| వివరాళ్లోకి వెళ్తే... హర్యానాలోని బర్వాలాకు చెందిన వివేక్ సైనీ (25) ఎంబీఏ చేసేందుకు అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు

By - Tupaki Desk
Update: 2024-01-29 05:30 GMT

విదేశాల్లో రోడ్డు ప్రమాదాలు, కాల్పులు, కత్తులు సుత్తులతో దాడులతో బలైపోతున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా హర్రర్ సినిమాలో చూపించినంత దారుణంగా జరిగిన దాడిలో ఒక భారతీయ విద్యార్థి మృతిచెందారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటన అమెరికాలో జరగగా.. మృతిచెందిన విద్యార్థి హర్యానాలోని బర్వాలాకు చెందిన వ్యక్తి అని తెలుస్తుంది.

అవును... అమెరికాలో మరో భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ దుండగుడు ఇండియన్ స్టూడెంట్ వివేక్ సైనీ తలపై సుత్తెతో సుమారు 50 సార్లు పాశవికంగా దాడి చేసి హతమార్చాడు. ఈ సమయంలో... ఆ భారతీయుడి ప్రాణాలు పోయే వరకు దుండగుడు అక్కడే కూర్చున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... హర్యానాలోని బర్వాలాకు చెందిన వివేక్ సైనీ (25) ఎంబీఏ చేసేందుకు అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే మరోవైపు జార్జియాలోని లిథోనియా ప్రాంతంలో గల దుకాణంలో గుమస్తాగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంది. దీంతో ఇళ్లు లేని ఓ నిరుపేద స్థానిక వ్యక్తి వచ్చి స్టోర్‌ లో ఆశ్రయం కోసం అర్ధించినట్లు తెలుస్తుంది.

పరిస్థితి అర్ధం చేసుకున్న స్టోర్ నిర్వాహకులు మానవతా కోణంలో ఆ నిరుపేద వ్యక్తి తలదాచుకోవడానికి చోటు ఇచ్చారట. ఈ క్రమంలో ఆ వ్యక్తితో మాట్లాడిన వివేక్ సైనీ... ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.. లేదంటే పోలీసులకు చెబుతాను అని హెచ్చరించాడట. దీంతో... కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి... వివేక్ పై సుత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో... వివేక్ సైనీ తలపై ఆ సుత్తితో సుమారు 50 సార్లు బాదడంతో.. వివేక్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని చెబుతున్నారు. హత్య అనంతరం సదరు దుండగుడు.. వివేక్ డెడ్ బాడీ వద్దే కూర్చుండిపోయాడు. ఇదంతా ఇదంతా దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

25-year-old Vivek Saini was attacked with a hammer by a homeless man at the Chevron Food Mart at Snapfinger and Cleveland Road in Lithonia late Monday night. #Homeless #usa #indian #internationalstudents pic.twitter.com/Cy2gL1tytH

— Gurpreet Kohja (@KhuttanGuru) January 22, 2024
Tags:    
  • Indianstudent 
  • America 
  • Americaviolence 
  • Viveksaini 
  • Georgia 
  • Usahomeless 
  • Unitedstates 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

Copyright @2026

Powered by Blink CMS