• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  'గారె'ల వాసనకు...

'గారె'ల వాసనకు పడిపోయారు.. ఇండియన్ అతిథి మర్యాదకు నెటిజన్ల ప్రశంసలు!

| మనకు నోరూరించే వంట వాసన తగిలినా, అది చూసినా "ఎవరో భలే వండుతున్నారు గురూ!" అనిపిస్తుంది కదా.

By - Tupaki Desk
Update: 2025-06-07 02:30 GMT

మనకు నోరూరించే వంట వాసన తగిలినా, అది చూసినా "ఎవరో భలే వండుతున్నారు గురూ!" అనిపిస్తుంది కదా. అమెరికాలో ఇద్దరు వ్యక్తులకు కూడా అలాంటి అనుభూతే కలిగింది. అయితే, వారు ఏం వండుతున్నారో తెలియదు. ఆకలిగా ఉందో, లేక ఆ తెలియని వంట వాసనపై ఆసక్తి కలిగిందో తెలీదు కానీ, ఆ వాసనను పట్టుకుని వెళ్లారు. ఒక భారతీయ మహిళ ఇంటి తలుపు తట్టారు. "మీ ఇంట్లో చాలా మంచి వాసన వస్తోంది. ఏం వండుతున్నారు?" అని అడిగారు.

ఆమె "గారెలు" వండుతున్నానని చెప్పడం ఆశ్చర్యం కాదు కానీ, ఆ తర్వాత జరిగినదే వైరల్ అయ్యింది. ఆ మహిళ వెంటనే "ఇదిగోండి.. మీరు రెండు గారెలు తినండి" అంటూ వాటిని పళ్ళాల్లో పెట్టి, కొబ్బరి పచ్చడితో సహా వారికి వడ్డించింది. ఈ సంఘటన ఇంటర్నెట్‌లో ఎంతగానో వైరల్ అవుతోంది. ఈ సంఘటన పది రోజుల క్రితం అమెరికాలోని మిన్నెసోటాలో జరిగింది. పేవ్‌మెంట్‌లను శుభ్రం చేస్తున్న ఇద్దరు అమెరికన్లు భారతీయ వంటకం (గారెల) వాసనకు పడిపోయి, ఆ ఇంటికి వెళ్లిన దృశ్యాన్ని స్వయంగా ఆ కంపెనీయే వీడియో తీసి 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది.

ఈ వైరల్ వీడియో కేవలం పది రోజుల్లోనే కోటి (10 మిలియన్) కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా "అంటే ఇది ఇండియన్ అంటే!", "అతిథి మర్యాదకు రియల్ ఎక్జాంపుల్" అంటూ భారతీయ సంస్కృతిని, ఆతిథ్యాన్ని వివిధ రకాలుగా ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. వారు చెప్పినట్లు "వినాలంటే భారతం వినాలి, తింతే గారెలు తినాలి!!" అనిపించేలా ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా భారత సంస్కృతికి మంచి గుర్తింపు తెచ్చింది.

Full View
Tags:    
  • IndianHospitality 
  • ViralVadas 
  • MinnesotaMoment 
  • IndianCulture 
  • CoconutChutney 
  • IndianFoodMagic 
  • Minnesota 

Similar News

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వ్యాపారవేత్త మృతి

2026-11-07 04:00 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

Copyright @2026

Powered by Blink CMS