• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  అమెరికాలో భార్య.....

అమెరికాలో భార్య.. కొడుకును చంపి సూసైడ్ చేసుకున్న టెకీ

| సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవాల్సిందే. పోరాడి గెలవాలే కానీ.. వెన్నుచూపకూడదు. ఇటీవల కాలంలో కొన్ని కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న విషాదాలు షాకింగ్ గా ఉంటున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-04-30 05:19 GMT

సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవాల్సిందే. పోరాడి గెలవాలే కానీ.. వెన్నుచూపకూడదు. ఇటీవల కాలంలో కొన్ని కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న విషాదాలు షాకింగ్ గా ఉంటున్నాయి. అలాంటి ఉదంతమే ఒకటి అమెరికాలోని భారత కుటుంబంలో చోటు చేసుకుంది. కారణం ఏమన్నది బయటకురాలేదు కానీ ఒక భారత టెకీ వ్యాపారవేత్త అమెరికాలో తన కుటుంబ సభ్యుల్ని చంపేసి.. తాను సూసైడ్ చేసుకున్న షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. అయితే.. ఒక కొడుకు మాత్రం ఈ హింస నుంచి తప్పించుకున్నాడు. ఏప్రిల్ 24న జరిగిన ఈ దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.

వాషింగ్టన్ న్యూక్యాజిల్ లో ఈ దారుణ ఉదంతంలోకి వెళితే.. 57 ఏళ్ల హర్షవర్ధన్ ఎస్ కిక్కెరీ తన భార్య 44 ఏళ్ల శ్వేత పన్యం.. వారి 14 ఏళ్ల కొడుకును చంపేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో వారి మరో కొడుకు హర్షవర్ధన్ ఇంట్లో లేకపోవటంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన హర్షవర్ధన్ చాలా సంవత్సరాల క్రితమే అమెరికాకు వెళ్లారు.

టెకీగా మంచి పేరు ప్రఖ్యాతుల్ని సాధించిన ఆయన.. 2017లో భార్య శ్వేతతో కలిసి భారత్ కు తిరిగి వచ్చారు. మైసూర్ లో హోలో వరల్డ్ పేరుతో రోబోటిక్ కంపెనీని ప్రారంభించారు. ఆయన సతీమణి శ్వేత సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఈ కంపెనీ మంచి పాపులార్టీని సొంతం చేసుకుంది. అంతేకాదు.. సరిహద్దు భద్రత కోసం రోబోలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒక ఐడియాతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు.

అయితే.. కొవిడ్ కారణంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో కంపెనీని 2022లో మూసేసి అమెరికాకు వెళ్లిపోయారు. రోబోటిక్స్ లో నిపుణుడైన ఆయన గతంలో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ లోనూ పని చేశారు. ఇదిలాఉంటే..ఏ కారణం వల్లో కానీ.. భార్య.. ఒక కొడుకును చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. వారి పోటోల్ని ప్రైవసీ కారణంగా పోలీసులు బయటకు విడుదల చేయలేదు. ఈ ఉదంతం అమెరికాలోని భారత కమ్యూనిటీల్లో సంచలనంగా మారింది.

Tags:    
  • USNews 
  • IndianDiaspora 
  • TragicIncident 
  • MentalHealthAwareness 
  • HarshavardhanKikkeri 
  • FamilyTragedy 
  • IndianInUS 
  • SuicideAwareness 
  • RobotCompany 
  • TechEntrepreneur 
  • CommunityShock 
  • IndianFamily 
  • MentalHealthMatters 

Similar News

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

ట్రంప్ అండతో రామస్వామి దూకుడు.. ఓహియో ఎన్నికల్లో వ్యక్తిగత దాడులే కీలకమవుతున్నాయా?

2026-10-23 05:17 GMT

Copyright @2026

Powered by Blink CMS