• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  నిజం చెప్పినందుకు 40...

నిజం చెప్పినందుకు 40 సెకన్లలో భారతీయుడి అమెరికా వీసా తిరస్కరణ

| అమెరికా వెళ్లాలని కలలు కంటున్న ఓ భారతీయుడి ఆశ నిమిషాల్లోనే ఆవిరైంది. వీసా ఇంటర్వ్యూలో అతడు చెప్పిన ఒకే ఒక్క సమాధానం అతడికి ఊహించని షాక్ ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-04-17 09:07 GMT

అమెరికా వెళ్లాలని కలలు కంటున్న ఓ భారతీయుడి ఆశ నిమిషాల్లోనే ఆవిరైంది. వీసా ఇంటర్వ్యూలో అతడు చెప్పిన ఒకే ఒక్క సమాధానం అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. కేవలం 40 సెకన్లలోనే అతడి వీసా దరఖాస్తును తిరస్కరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అతడు తన ఆవేదనను వెళ్లగక్కాడు. నిజాయితీగా సమాధానం చెప్పినా తనకు వీసా ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

‘nobody01810’ అనే రెడిట్ యూజర్ తన బాధను ఓ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. తాను ఇటీవల బీ1/బీ2 వీసా కోసం యూఎస్ ఎంబసీకి వెళ్లానని తెలిపాడు. అక్కడ తనను కేవలం మూడు ప్రశ్నలు మాత్రమే అడిగారని, నిమిషం తిరిగేలోపే తన వీసాను తిరస్కరించారని వాపోయాడు. అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? మీరు ఇంతకుముందు భారత్ వెలుపల ఎప్పుడైనా పర్యటించారా? అమెరికాలో మీకు బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అని అధికారులు ప్రశ్నించారట.

ఈ ప్రశ్నలకు ఆ వ్యక్తి నిజాయితీగా సమాధానం చెప్పాడు. "నేను రెండు వారాల పాటు వెకేషన్‌ కోసం ఫ్లోరిడా వెళ్లాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను భారత్ దాటి ఎక్కడికీ వెళ్లలేదు. ఫ్లోరిడాలో నాకు ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంది" అని బదులిచ్చాడు. అయితే, ఆ వ్యక్తి సమాధానాలు యూఎస్ ఎంబసీ అధికారికి నచ్చలేదని తెలుస్తోంది. అతడు వీసాకు అర్హుడు కాదని చెబుతూ తిరస్కరణ పత్రాన్ని అతడి చేతిలో పెట్టారు.

తాను కేవలం పర్యటన కోసమే అమెరికా వెళ్లాలనుకున్నానని, తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడం అనేది ఒక అదనపు అవకాశం మాత్రమేనని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు. తాను కేవలం రెండు వారాలు మాత్రమే అక్కడ ఉండి తిరిగి భారత్‌కు వచ్చేస్తానని చెప్పినా అధికారులు తన అభ్యర్థనను తిరస్కరించడం అతడికి బాధ కలిగించింది. వీసా ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది "మీరు మీ గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పడం వల్లే మీ వీసాను తిరస్కరించారు. మీరు ఆమె సహాయంతో అమెరికాలో అక్రమంగా ఉండిపోతారని వారు భయపడి ఉంటారు" అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం నిజాయితీగా సమాధానం చెప్పినా వీసా తిరస్కరించడం అన్యాయమని అభిప్రాయపడుతున్నారు.

Tags:    
  • USVisa 
  • VisaRejected 
  • IndianInUSA 
  • USVisaInterview 
  • B1B2Visa 
  • TravelDenied 
  • VisaIssues 
  • HonestMistake 
  • VisaExperience 
  • FloridaTrip 
  • VisaRejectionStory 
  • RedditViral 
  • TrendingNow 

Similar News

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వ్యాపారవేత్త మృతి

2026-11-07 04:00 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

Copyright @2026

Powered by Blink CMS