• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  మసాజ్ కోసం ఇంటికి రమ్మన్న...

మసాజ్ కోసం ఇంటికి రమ్మన్న డాక్టర్... 18నెలల జైలు!

| ఈ క్రమంలో విచారణ తర్వాత చిచెస్టర్ క్రౌన్ కోర్టులో అబ్రహం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించబడింది

By - Tupaki Desk
Update: 2023-08-01 08:24 GMT

వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తుంటారు చాలామంది ప్రజానికం. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో వైద్యో నారాయణో హరి అని అంటారు. అయితే వైద్యులందు కొంతమంది రాక్షసులు కూడా ఉంటారు.. సక్రమంగా చదువుకుని వైద్య వృత్తిలో ఉన్న వారి బుద్ది ఒక్కోసారి వంకరగా ఆలోచిస్తుంటుంది!

అవును... తాజాగా యూకేలోని ఒక వైద్యుడికి బుద్ది అలా వంకరగానే ఆలోచించింది. ఫలితంగా 18నెలల జైలు శిక్ష పడింది. ఇదే సమయంలో లైంగిక వేదింపుల నేరస్థుల రిజిస్టార్ లో 10ఏళ్లపాటు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

వివరాళ్లోకి వెళ్తే... సైమన్ అబ్రహం అనే 34 ఏళ్ల యూకే వైద్యుడు ఈస్ట్‌ బోర్న్ జిల్లా జనరల్ హాస్పిటల్‌ లో పనిచేస్తున్నాడు. అయితే 2020 అక్టోబర్ లో ఒక మహిళ తీవ్రమైన తలనొప్పికి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఈ సమయంలో వైద్యం చేయడం ప్రారంభించిన సైమన్... ఆమెకు మసాజ్ అవసరం అని తెలిపాడు.

ఈ సమయంలో తాను భారతీయ మసాజ్ లో ఎక్స్ పర్ట్ అని.. సుమారు రెండేళ్లుగా ఈ మసాజ్ లో ప్రావిణ్యం సంపాదించినట్లు పేర్కొన్నాడు. దీంతో... మెరుగైన మసాజ్ కోసం ఇంటికి రమ్మని సూచించాడు. దీంతో... ఆమె వైద్యుడి ఇంటికి వచ్చింది. ఇదే అదనుగా మసాజ్ పేరుతో ఆమెను అసభ్యకరంగా తాకడం మొదలుపెట్టాడు.

అనంతరం ఆమెపై మసాజ్ సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ సమయంలో డాక్టర్ ఇంటికి మరొక వ్యక్తి రావడంతో.. ఆ దాడికి అంతరాయం కలిగింది. అయితే ఆ సంఘటన తర్వాత కూడా సైమన్ అబ్రహం.. ఆ మహిళను సంప్రదించడం కొనసాగించాడు.

దీంతో విసుగుచెందిన ఆ మహిళ... ఈ విషయాన్ని ఆసుపత్రికి వెళ్లడించింది, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో విచారణ తర్వాత, చిచెస్టర్ క్రౌన్ కోర్టులో అబ్రహం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించబడింది.

దీంతో ఆ వైద్యుడికి 18 నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇదే సమయంలో జైలు శిక్షకు అదనంగా అతడు 10 సంవత్సరాల పాటు లైంగిక నేరస్థుల రిజిస్టర్‌ లో ఉంటాడని తెలిపింది.

Tags:    
  • Eastbournedoctor 
  • Sexuallyassaulting 
  • Patient 
  • UKdoctor 
  • Sexualharrasement 
  • Simonabraham 
  • Doctorsimon 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

ట్రంప్ అండతో రామస్వామి దూకుడు.. ఓహియో ఎన్నికల్లో వ్యక్తిగత దాడులే కీలకమవుతున్నాయా?

2026-10-23 05:17 GMT

అమెరికా నుంచి భారత్‌కు ఐటీ ఉద్యోగుల రివర్స్ జర్నీ.. 9 నెలల్లో 12,700 మంది వెనక్కి!

2026-10-22 04:23 GMT

Copyright @2026

Powered by Blink CMS