ఐస్ ఏజ్...లో మనం కూడా జీవించబోతున్నాం

Update: 2015-07-13 03:13 GMT
అంతా సాఫీ గా జరిగిపోతోందని అనుకొంటున్న విశ్వ పరిణామాల్లో కొన్ని మార్పులు సంభవించబోతున్నాయా? మన సౌరకుటుంబంలో రాబోయే మార్పులు భూమిపై పరిస్థితులను మార్చివేయనున్నాయా? భూమి ఒక మహా మంచు యుగాన్ని ఎదుర్కొనడానికి రెడీగా ఉండాలా? ఎంతో దూరంలో కాదు.. మరో పదిహేను సంవత్సరాల్లోఏ ఒక ముంచు యుగం భూమిని ముంచెత్తనుందా? ఈ సరికొత్త.. ఆసక్తికరమైన.. అసందేహాలను రేకెత్తిస్తూ.. ఔను, భూమి ఒక మంచు యుగాన్ని ఎదుర్కొనడానికి రెడీగా ఉండాలని అంటున్నారు అంతరిక్ష పరిశోధకులు.

భూమిపై ఒక నిర్దిష్టమైన వాతావరణం ఉంది. అది సౌరశక్తితో ప్రభావితం అవుతోంది. సూర్యుడి నుంచి వెలువడే వేడిమి ఫలితంగా భూమిపై వాతావరణం ప్రభావితం అవుతోంది. మరి అలాంటి సూర్యుడి పవర్ లో వచ్చే తేడాలు.. భూమిపై వాతావరణాన్ని మార్చి వేస్తాయి. భూమిని చేరే సౌరశక్తిలో ఏమాత్రం తేడాలు వచ్చినా.. వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది! త్వరలో జరగబోయేది అదేనని అంటున్నారు పరిశోధకులు. శాస్త్రీయంగా ఆ పరిస్థితిని "మాండర్ మినిమమ్'' అంటారు. అప్పుడు సౌరశక్తిలో క్రియాశీలత తగ్గిపోతుంది!

ఫలితంగా భూమిపై వాతావరణం చల్లబడిపోతుంది. ఎంతలా అంటే.. నదులు, సముద్రాలు గడ్డకట్టిపోయేంతలా! భూ ప్రపంచం మీద అంతా వాతావరణం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇక  ప్రస్తుత పరిస్థితుల్లో చల్లటి వాతావరణం.. ఉండే దేశాల పరిధిలో  అయితే.. నీరంతా గడ్డికట్టిపోతుంది! అక్కడి నదులు.. స్తంభించి పోతాయి. మంచుగడ్డగా మారిపోతాయి. 2030 నుంచి 2040ల మధ్య ఈ పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి 2030 అంటే.. అది ఎంతో దూరం లేదు. 97 శాతం కచ్చితంగా మాండర్ మినిమమ్ పరిస్థితులు ఏర్పడతాయని పరిశోధకులు చెబుతుండటం విశేషం.

భూమి ఇది వరకే ఇలాంటి వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంది. 17, 18 వ శతాబ్దాల సమయంలో.. మినీ మంచుయగం ఒకటి ఏర్పడింది. అప్పట్లో లండన్ పక్కగా పోయే థేమ్స్ నది పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. అచ్చం అలాంటి పరిస్థితులే కాలచక్రంలో భాగంగా మరో పదిహేను సంవత్సరాల్లోనే ఏర్పడవచ్చు. మరి ఈ తరం అలాంటి అద్భుతాన్ని చూడగలదేమో!
Tags:    

Similar News