యూత్ ఈజ్ గోల్డ్...వైసీపీలో అతి పెద్ద కుదుపు

ఇక చూస్తే కనుక 2029 ఎన్నికల నాటికి వైసీపీలో ఉన్న వారిలో అత్యధికులు డెబ్బైలకు చేరువ అవుతారు అని అంటున్నారు.;

Update: 2025-10-18 04:30 GMT

వైసీపీలో అతి పెద్ద కుదుపుని అధినేత జగన్ తీసుకుని రాబోతున్నారా. ఒక విధంగా ఇది ప్రయోగమా లేక అనివార్యమా అన్నది కూడా పార్టీలో ఇపుడు వాడి వేడిగా చర్చగా మారింది. వైసీపీలో అంతా సీనియర్లు ఉన్నారు అన్నది తెలిసిందే. వారంతా కూడా కాంగ్రెస్ లో దీర్ఘ కాలం పనిచేసి ఉన్న వారు. ప్రజలకు వారు ముఖాలు కూడా దశాబ్దాలుగా తెలుసు. వైసీపీలో నాయకుల సగటి వయసు ఆరు పదులు దాటింది అని కూడా చెబుతారు. అందుకే వైసీపీ అధినాయకుడు ఒక భారీ ఎక్సర్ సైజ్ దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

యూత్ తోనే అంతా :

వైసీపీకి యువ రక్తం ఎక్కించాలని జగన్ చూస్తున్నారు. పార్టీ నిర్మాణంలో టాప్ టూ బాటమ్ యువతతోనే అత్యధికంగా నింపాలని చూస్తునారని చెబుతున్నారు. వైసీపీలో ఇపుడు కీలక బాధ్యతలతో కానీ పార్టీకి ముఖ్యమైన పీఏసీలో కానీ సీనియర్లు ఉన్నారు. వారంత ఆరు పదులు పై దాటిన వారే. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ మంది సీనియర్లు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా అధికం వారే ఉన్నారు. అయితే రేపటి ఎన్నికలు తీరు అలా ఉండదని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు.

అప్పటికి వేరేగా :

ఇక చూస్తే కనుక 2029 ఎన్నికల నాటికి వైసీపీలో ఉన్న వారిలో అత్యధికులు డెబ్బైలకు చేరువ అవుతారు అని అంటున్నారు. అంతే కాదు చాలా మంది నాయకులు పోటీకి కూడా సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు అని అంటున్నారు. దాంతో అసెంబ్లీ ఇంచార్జిల నుంచి అందరికీ యూత్ ని నియమించే పనిని ఇప్పటి నుంచే మొదలెడితే ధీటుగా 2029 ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవచ్చు అన్నది జగన్ ప్లాన్ అని అంటున్నారు. అంతే కాదు కూటమిలో ఎక్కువ మంది యూత్ కనిపిస్తున్నారు వైసీపీలో జగన్ యూత్ లీడర్ గా ఉన్నా మిగిలిన వారు ఎక్కువ మంది సీనియర్లు కావడంతో పార్టీ వృద్ధాప్య సమస్యతో సతమతమవుతోంది అన్న చర్చ కూడా సాగుతోంది.

పవర్ ఫుల్ ఇమేజ్ కోసం :

అదే విధంగా వైసెపీకి కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేయాలని జగ్న ఆలోచిస్తున్నారు. ఎపుడూ కనిపించే ముఖాలను చూస్తే జనాలకు ఆ తాజాదనం కనిపిందని కూడా అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. అందుకే వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఇక మీదట పార్టీలోకి యువ నాయకులను పెద్ద ఎత్తున తీసుకుని రావడం చేస్తారు అని అంటున్నారు. వారికే మెచ్చి వరమాల వేస్తారు అని చెబుతునారు. అలాగే పార్టీకి మరింత శక్తివంతమైన ఇమేజ్‌ను సృష్టించడం ద్వారానే తిరిగి ప్రజల విశ్వాసాన్ని పునర్నిర్మించ గలమని జగన్ భావిస్తున్నారుట. ఈ విషయం మీద ఆయన మధనం జరుపుతున్నారని తెలుస్తోంది. నవంబర్ నెలలో పార్టీలోని ఉన్నత స్థాయిలో ఈ విషయం మీద అందరి నేతలతో సంప్రదింపులు జరిపి ఆ మీదట నాయకత్వ మార్పులకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాల ప్రచారంగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News