వైసీపీ కాంగ్రెస్ అనేది కలవడం అంటే ?

కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అని కొందరు లేదు ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటారు అని మరి కొందరూ ఇలా రకరకాలైన ప్రచారం చేస్తున్నారు.

Update: 2026-06-15 03:42 GMT

కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అని కొందరు లేదు ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటారు అని మరి కొందరూ ఇలా రకరకాలైన ప్రచారం చేస్తున్నారు. అయితే ఏపీలో పొలిటికల్ సన్నివేశం పూర్తిగా వేరు అని గుర్తు చేస్తున్నారు. జగన్ ఆలోచనలు ఆయన మనస్తత్వం కాంగ్రెస్ ని జగన్ వీడిన సందర్భం ఇవన్నీ గుర్తు చేసుకుంటున్న వారు మాత్రం వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో విలీనం అయ్యే ప్రసక్తి లేదని అంటున్నారు. ఏపీలో ఈ రోజుకీ ఒంటరిగానే 40 శాతం ఓటు షేర్ ని సాధించి రేపటి ఎన్నికల్లో గెలిచే పార్టీగా ముద్ర ఉన్న వైసీపీకి కాంగ్రెస్ ని కౌగిలించుకోవడం అవసరమా అన్న ప్రశ్న కూడా రాజకీయ విశ్లేషకులు పలువురు వేస్తున్నారు.

సోలోగానే ఫైట్ :

ఏపీ రాజకీయాలలో చూస్తే కనుక జగన్ ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడుతున్నారు అని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి సందర్భానుసారం విధానాల ప్రాతిపదికన అంటూ బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది. ఆ విధంగా బీజేపీ పెద్దల వద్ద వైసీపీ గుడ్ విల్ సంపాదించుకుంది. అందుకే ఏపీలో టీడీపీ కూటమి మీద ధీటుగా పోరు చేస్తోంది అని అంటున్నారు. ఇక 2029 లో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా వచ్చినా కూడా వైసీపీ ఒంటరిగానే పోరుకు సిద్ధపడుతుందని చెబుతున్నారు. జనాలు నచ్చకపోతే కూటములను అయినా ఓడిస్తారు అన్నది దేశంలో చాలా ఎన్నికలు నిరూపించాయని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. పైగా వైసీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ 40 పర్సెంట్ ఉందని మరో పది శాతం తెచ్చుకుంటే అధికారం సొంతం అవుతుందని కూడా లెక్క వేస్తున్నారు.

ఈసారి వైసీపీ అవసరం :

ఇక 2029 ఎన్నికలు చూస్తే కచ్చితంగా ఏ కూటములకు పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కే సీన్ ఉండదని కూడా అంటున్నారు. బీజేపీని మూడు సార్లు చూసిన జనాలు ఈసారి పూర్తిగా ఏకపక్షంగా నెత్తికెత్తుకోరు అని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి బలం పెరిగినా కూడా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా రాలేరని అంటున్నారు. దాంతో న్యూట్రల్ గా ఉండే పార్టీలకు ఆ ఎన్నికల తరువాత డిమాండ్ పెరుగుతుందని అపుడు వైసీపీ లాంటి పార్టీలే కీలకంగా జాతీయ స్థాయిలో మారుతాయని కూడా ఫ్యాన్ పార్టీ నేతలు లెక్క వేస్తున్నారు.

అందుకే ఆప్షన్లు ఓపెన్ :

ఈ క్రమంలో వైసీపీ అన్ని ఆప్షన్లూ ఓపెన్ గా ముందు పెట్టుకుంటుంది అని అంటున్నారు. అంతే తప్ప పొత్తుల పేరుతో ముందే కమిట్ అయిపోతే ఆ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ కోల్పోతామని అంటున్నారు. ఏపీలో ఎలా చూసుకున్నా కాంగ్రెస్ అయితే ఈ రోజుకీ లేదని అంటున్నారు. మరో మూడేళ్ళలో కూడా అద్భుతాలు జరిగి కాంగ్రెస్ ఎదుగుతుందని కూడా ఎవరూ అనుకోవడం లేదని అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ తో పొత్తులు కానీ విలీనాలు కానీ వైసీపీకి అవసరం లేదని అంటున్నారు. పైగా జగన్ ని నాడు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అవమానించిందని అందుకే బయటకు రావాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక జగన్ మీద నాడు సీబీఐ కేసులు పెట్టడంతోనే ఆయన పదహారు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చిందని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ కాంగ్రెస్ అనేది కలవడం అంటే అది ఇప్పట్లో జరిగేది కాదని అంటున్నారు ఒకవేళ 2029 ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారానికి దగ్గరగా వస్తే కనుక అపుడు ఆలోచించే వీలు ఉందని కూడా అంటున్నారు. సో ప్రస్తుతానికి వస్తున్నవి అన్నీ ఊహాగానాలే అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News