కృష్ణ‌వేణిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది..!

గురువారం పార్టీ కీల‌క నాయ‌కురాలు, పైగా.. వైసీపీ సోష‌ల్ మీడియా సెకండ్ ఇంచార్జ్‌గా ఉన్న పాలేటి కృష్ణ‌వేణిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.;

Update: 2025-04-19 17:30 GMT

వైసీపీలో ఏం జ‌రుగుతోంది? అధికారం పోయినా.. నాయ‌కుల మ‌ధ్య అహంకారం కొన‌సాగుతోందా? ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా ఉన్నారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గురువారం పార్టీ కీల‌క నాయ‌కురాలు, పైగా.. వైసీపీ సోష‌ల్ మీడియా సెకండ్ ఇంచార్జ్‌గా ఉన్న పాలేటి కృష్ణ‌వేణిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోష‌ల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు త‌మకు ఇబ్బందిక‌రంగా ఉన్నాయ‌ని పేర్కొంటూ.. ఇచ్చిన ఫిర్యాదు పై పాలేటిని పోలీసులు వెంటాడి మ‌రీ అరెస్టు చేశారు.

హైద‌రాబాద్‌లో దాక్కున్నారంటూ.. అక్క‌డ‌కు వెళ్లి మ‌రీ.. గుంటూరు పోలీసులు తీసుకువ‌చ్చారు. అనంతరం.. స్థానిక కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా.. 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే.. పాలేటిని ప‌రామ‌ర్శించేం దుకు ఒక్క‌రూ స్టేష‌న్‌ద‌గ్గ‌ర‌కు రాక‌పోవ‌డం.. ఆమెకు అనుకూలంగా న్యాయ‌సాయం చేసేందుకు కూడా ఎవ‌రు స్పందించ‌క‌పోవ‌డం.. వైసీపీలో చ‌ర్చ‌నీయాంశం అయింది. వాస్త‌వానికి పాలేటికి.. మాజీ మంత్రి ర‌జ‌నీతో వ్య‌క్తిగ‌త సంబంధాలు కూడా ఉన్నాయ‌ని ప్ర‌చారం ఉంది.

దీంతో ఆమెపై ర‌జ‌నీ మ‌నిషి అని ముద్ర ప‌డింది. వ్య‌క్తిగ‌తంగా కూడా.. పాలేటి కృష్ణ‌వేణి.. చిల‌క‌లూరిపేట కు చెందిన నాయ‌కురాలే. త‌ర్వాత కాలంలో వైసీపీసోష‌ల్ మీడియాలోకి వ‌చ్చారు. ఇక‌, మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ర‌జ‌నీకి చేదోడుగా.. ప్ర‌చార‌కర్త‌గా కూడా కృష్ణ‌వేణి వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఇప్పుడు అరెస్ట‌య్యా రు. అయితే.. ర‌జ‌నీ అనుచ‌రురాలు అనే ముద్ర ప‌డ‌డంతో కృష్ణ‌వేణిని ఇత‌ర నాయ‌కులు ప‌ట్టించుకోలే దు. పోనీ.. ర‌జ‌నీ అయినా.. ప‌ట్టించుకోవాలి క‌దా? అనే ప్ర‌శ్న వ‌స్తుంది.

అయితే.. కార‌ణాలు ఏవైనా.. ర‌జ‌నీ కూడా.. కృష్ణ‌వేణిని ప‌ట్టించుకోలేదు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. కీల‌క నేత‌ల‌తో వున్న విభేదాల కార‌ణంగా ర‌జ‌నీ కూడా పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క్ర‌మాలకు కూడా దూరంగా ఉం టున్నారు. ఈ నేప‌థ్యంలోనే పాలేటికి మ‌ద్ద‌తుగా ఎవ‌రూ వెళ్ల‌లేదు. మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కులు తండోప తండాలుగా స్టేష‌న్‌కు వ‌స్తార‌ని భావించిన పోలీసులు.. స్టేష‌న్ గేటుకు.. బేడీలు వేశారు. అదేస‌మ‌యంలో తాళాలు కూడా వేశారు. కానీ, ఒక్క‌రు కూడా.. ఆదిశ‌గా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News