వైసీపీ తొలి పీఏసీ...సంచలన నిర్ణయాల దిశగా !
వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ (పీఏసీ) కీలక సమావేశం ఈ నెల 22న తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. పీఏసీని పునర్ వ్యవస్థీకరించిన తరువాత జరితే మొదటి సమావేశం ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది.;
వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ (పీఏసీ) కీలక సమావేశం ఈ నెల 22న తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. పీఏసీని పునర్ వ్యవస్థీకరించిన తరువాత జరితే మొదటి సమావేశం ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. పాత వారిని చాలా మందిని పీఏసీ నుంచి తప్పించారు. అలాగే సీనియర్లను కొత్త వారిని తెచ్చి చోటు కల్పించారు.
మొత్తం 33 మందితో పీఏసీని ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఏర్పాటు చేశారు. ఈ పీఏసీకి కన్వీనర్ అన్న పోస్టుని కూడా క్రియేట్ చేసి దానికి సీనియర్ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డిని నియమించారు. ఇదిలా ఉంటే జగన్ అధ్యక్షతన 22న జరిగే పీఏసీలో చర్చించే అంశాల మీద ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు.
వైసీపీకి పీఏసీ అన్నది కొత్త కాదు, పార్టీ ప్రారంభించిన కొత్తలోనే దానిని ఏర్పాటు చేశారు. పార్టీలో అత్యున్నత విధాయక నిర్ణయ మండలిగా పేర్కొన్నారు. అయితే పీఏసీలో చాలా మంది సీనియర్లకు స్థానం ఇచ్చినప్పటికీ ఎక్కువగా సమావేశాలు గతంలో జరిగినవి లేవు అని ప్రచారంలో ఉంది.
ఇక వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళూ పార్టీ గురించి పెద్దగా ఆలోచించినదీ లేదని చెప్పుకున్నారు. ఇపుడు ఎన్నికల్లో ఓటమి తరువాత భారీ ఎత్తున రిపేర్లు చేస్తున్నారు. అందులో భాగంగా పీఏసీలోనూ భారీ మార్పులు చేశారు. పనిచేసే వారే పీఏసీలో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ మార్పులు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పటిదాకా వివిధ జిల్లాల అధ్యక్షులతో రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశాలను జగన్ నిర్వహించారు. అదే సమయంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో మీటింగ్స్ పెట్టారు. కానీ పార్టీకి గుండె కాయ లాంటి పీఏసీ మీటింగ్ ఓటమి తరువాత ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు.
మరి ఈ మీటింగులో సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో కూటమి పాలన మరో నెలన్నరలో ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏ విధంగా పోరాటం చేయాలన్నది ప్రత్యేకంగా చర్చిస్తారు అని అంటున్నారు. అలాగే ఏపీలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం పనులు త్వరలో మొదలవుతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించారని వైసీపీ ఆరోపిస్తోంది.
వక్ఫ్ సవరణ చట్టం మీద సుప్రీం కోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఇక కేంద్రంలో ఎన్డీయేతో రాజకీయ సంబంధాలు మీద చర్చ ఉంటుందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అదే విధంగా జగన్ జనంలోకి ఎపుడు రావాలి ఏమిటి అన్నది కూడా చర్చిస్తారు అని అంటున్నారు.
ఇక కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మీద వైసీపీ మార్క్ విశ్లేషణ ఉంటుందని చెబుతున్నారు. అలాగే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ని అమలు చేశారు ఎన్ని చేయలేదు అన్న దాని మీద కూడా చర్చిస్తారు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే కనుక వైసీపీ ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలన్న దాని మీద కీలక నిర్ణయాలు ఈ భేటీలో తీసుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ పార్టీ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పీఏసీ భేటీని నిర్వహిస్తున్నారు. సంచలన నిర్ణయాలు ఈ మీటింగ్ ద్వారా వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏ రకమైన ప్రకటనలు వస్తాయో.