'డిఫెన్స్‌'లో వైసీపీ.. చాలా విష‌యాలున్నాయ్ ... !

వైసీపీ నాయ‌కులు ఆత్మ‌ర‌క్ష‌ణలో ప‌డ్డారా? .. ఇటు స‌భ‌కు రాకుండా.. అటు మీడియా ముందు కూడా పెద్ద‌గా చొర‌వ లేకుండా పోవ‌డంతో పార్టీ ప‌రిస్థితిపై త‌లోర‌కంగా చ‌ర్చించుకుంటున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.;

Update: 2026-02-25 23:30 GMT

వైసీపీ నాయ‌కులు ఆత్మ‌ర‌క్ష‌ణలో ప‌డ్డారా? .. ఇటు స‌భ‌కు రాకుండా.. అటు మీడియా ముందు కూడా పెద్ద‌గా చొర‌వ లేకుండా పోవ‌డంతో పార్టీ ప‌రిస్థితిపై త‌లోర‌కంగా చ‌ర్చించుకుంటున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ''స‌భ‌లో మాపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెం టేష‌న్ కూడా ఇస్తున్నారు. దీనిని ఎదుర్కొనాలంటే.. మేం అక్క‌డ ఉండాలి. కానీ, ఇది సాధ్యం కాదు. ఇలానే ప్ర‌చారం జ‌రిగితే.. పార్టీకి మాకు కూడా ఇబ్బందే'' అని ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఈ వాద‌న సీమ‌లో ఎక్కువ‌గా ఉంది. అనేక విష‌యాల‌ను ఎదుర్కొంటున్నామ‌ని.. బ‌ల‌మైన వాయిస్ విని పించ‌లేక పోతున్నామ‌ని ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ''ఒక్క‌టి కాద‌బ్బా.. వంద ఉన్నాయి. అన్నింటికీ స‌మాధానం చెప్పాలి. కానీ.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఉందో లేదో మాకు అర్ధం కావ‌ట్లేదు.''  అని వ్యాఖ్యానించారు. మ‌రికొంద‌రు.. వైసీపీ సోష‌ల్ మీడియాను న‌మ్ముకుని ముందుకు సాగుతుండ‌డాన్ని కూడా స‌రైన చ‌ర్చ‌కాద‌ని అంటున్నారు.

గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పార్టీకి ఉన్న మెజారిటీ ఓటు బ్యాంకు క‌దిలిపోయింద‌ని.. కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా ఇది ఏకీకృతం అవుతుంద‌ని చెప్ప‌లేమ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. పార్టీని ప్ర‌జ‌ల్లో లైవ్‌లో ఉంచాలంటే.. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల వ‌ల్ల కాద‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంటా బ‌య‌టా.. ల‌డ్డూ వ్య‌వ‌హారం త‌ల‌నొప్పిగానే మారింద‌ని మాజీ మంత్రి, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన నేత వ్యాఖ్యానించారు. మ‌ద్యం కేసు వ్య‌వ‌హారం కూడా అలానే ఉంద‌న్నారు.

వీటికితోడు.. కొంద‌రు నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు.. వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా.. పార్టీకి శ‌రాఘాతంగా మా రింద‌ని చెబుతున్నారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు ఒక విధ‌మైన అభ‌ద్ర‌తా భావంతోనే ఉన్నార న్నది ప్ర‌ధాన చ‌ర్చ‌. దీని నుంచి ముందు పార్టీ బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. నాయ‌కుల్లో స్థ‌యిర్యం నింపేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. కానీ.. ఇంకా సోష‌ల్ మీడియా నే న‌మ్ముకుని.. అంతా బాగుంద‌ని చెప్ప‌డాన్నికొంద‌రు త‌ప్పుబడుతున్నారు.

Tags:    

Similar News