షర్మిలకు 'లైన్' తెలీడం లేదా?
రాజకీయాల్లో ఉన్నవారికి.. ముందు తాము నడిచే దారి తెలియాలి. తాము ఎంచుకున్న మార్గంలో నడక తెలియాలి.;
రాజకీయాల్లో ఉన్నవారికి.. ముందు తాము నడిచే దారి తెలియాలి. తాము ఎంచుకున్న మార్గంలో నడక తెలియాలి. ఈ రెండు తెలియకపోతే.. తప్పటడుగులు తిప్పలు తెస్తాయి. ఫక్తు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఆమె ఎంచుకున్న `లైన్` ఏంటో ఆమె కైనా తెలుస్తోందా? అనేది ప్రశ్న. కొన్నాళ్లు అన్న జగన్‌పై విరుచుకుపడతారు. మరికొన్నాళ్లు.. ప్రజలంటా రు. వారి సమస్యలైనా పట్టించుకుంటున్నారా? అంటే లేనే లేదు.
తాను ప్రాతినిధ్యం వహించి పోటీ చేసిన కడప జిల్లా కడప పార్లమెంటు స్థానంలోగత ఏడాది షర్మిల ఓడిపో యారు. అయితే.. అప్పట్లో తాను ఓడిపోయినా.. నియోజకవర్గానికి వస్తానని.. అక్కడే రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. కానీ.. ఇప్పటి వరకు 10 మాసాలు దాటి పోయినా.. షర్మిల కడప నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. నాలుగు సార్లు ఆమె కడపకు వెళ్లినా.. తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారే తప్ప.. నియోజకవర్గం ప్రజల బాగోగులను పట్టించుకోలేక పోయారు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పిన షర్మిల.. ఇప్పటి వరకు హైదరాబాద్, విజయవాడలలోనే మకాం పెట్టుకుని సోషల్ మీడియా రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఇక, తాజాగా మోడీని తిట్టాలన్నది ఆమె కోరిక కావొచ్చు. ఎందుకంటే.. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతున్నది మోడీనేనని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె నేరుగా మోడీని కామెంట్లు చేయొచ్చు. కానీ.. అవి వర్కవుట్ అయ్యే అవకాశం లేకపోవడంతో చంద్రబాబును మధ్యలోకి లాగి మోడీని ముడిపెడుతూ.. విమర్శలు గుప్పించడం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
``నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే.`` అని అంటున్న షర్మిల.. ఈ పదేళ్ల కాలంలో ఏం చేశారన్నది ప్రశ్న. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని చెబుతున్న షర్మిల నాడు విభజన చ ట్టంలో ఏపీకి అన్యాయం చేసింది సొంత పార్టీనేనని కూడా చెప్పి ఉంటే.. ప్రజలు నిజంగా షర్మిలను మెచ్చుకుంటారు.
``ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్ళారు.`` అని చెబుతున్న షర్మిల.. విజయవాడ సమీపంలో తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి ఎన్నాళ్లయిందో చెప్పాలి.. మరి విల్లా కట్టడానికే అంత సమయం పడుతుంటే.. ప్రజారాజధానికి ఎంత సమయం పట్టాలి? ఏదేమైనా.. షర్మిలకు `లైన్` క్లియర్‌గా లేదని అంటున్నారు పరిశీలకులు.