• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'చెల్లి పెళ్లి చేయాలి...

'చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ'... కడపలో షర్మిళ సంచలన వ్యాఖ్యలు!

| అవును... కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. వైఎస్ అవినాష్ రెడ్డిపై స్పందించారు.

By - Tupaki Desk
Update: 2024-11-20 09:26 GMT

వైఎస్ అవినాష్ రెడ్డి పేరు చెబితే వైఎస్ షర్మిల అంతెత్తున లేచి పడతారని అంటుంటారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతర పరిణామాలు.. ప్రధానంగా కడప ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచీ ఆమె.. అతని విషయంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారని చెబుతుంటారు. ఈ సమయంలో మరోసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల ఫైర్ ఆయ్యారు.

అవును... కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. వైఎస్ అవినాష్ రెడ్డిపై స్పందించారు. ఇందులో భాగంగా... తనతో పాటు విజయమ్మ, సునీతపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించింది అవినాష్ రెడ్డే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని.. అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాష్ ను విచారించి అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. అసలు సోషల్ మీడియాలో అసభ్యకర పొస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డి మూలకారణమని షర్మిల అన్నారు. ఈ సమయంలో.. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు.

ఇక గత పదేళ్లూ స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి.. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏమి చేశారని ప్రశ్నించిన షర్మిల... ఇలాంటి నాయకులను ఎన్నుకునేముందు ప్రజలు ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. కడప స్టీల్ ప్లాంట్ కోసం గత ఐదేళ్లలో జగన్ చేసింది కూడా ఏమీ లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా... కడప స్టీల్ ప్లాంట్ ను టెంకాయలు కొట్టే ఫ్యాక్టరీగానే గత పాలకులు తయారు చేశారని విమర్శించిన షర్మిల.. మీడియా ఎదుట టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థానపలకు పరిమితం అయ్యిందని అన్నారు.

ఇక... పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివృద్ధి కోసం వైఎస్సార్ ఎంతో చిత్తశుద్ధితో దీన్ని తీసుకువచ్చారని.. దీని ద్వారా సుమారు 25 వేల మందికి ప్రత్యక్షంగా, దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందని అన్నారు. 20 మిలియన్ల టన్నుల సామర్థ్యంతో దీని నిర్మాణం చేపట్టాలన్నది ఆయన ఆశయం అని షర్మిల గుర్తుచేశారు!

Tags:    
  • Andhrapradesh 
  • Kadapa 
  • Yssharmila 
  • Ysavinashreddy 
  • VarraRavinderReddy 
  • Vijayamma 
  • Sunitha 
  • Kadapasteelplant 
  • Politicalnews 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS