జాతీయ రాజ‌కీయాలపై ష‌ర్మిల ఆస‌క్తి.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. రాష్ట్ర రాజ‌కీయాల కంటే కూడా.. జాతీయ పాలిటిక్స్‌పై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారా? అంటే.. అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.;

Update: 2025-12-18 04:30 GMT

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. రాష్ట్ర రాజ‌కీయాల కంటే కూడా.. జాతీయ పాలిటిక్స్‌పై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారా? అంటే.. అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గ‌త రెండు నెల‌లుగా ఆమె జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. ఏపీ రాజ‌కీయాల కంటే కూడా.. జాతీయ పాలిటిక్స్‌పైనే ఎక్కువ‌గా స్పందిస్తున్నారు. మోడీ స‌హా బీజేపీని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఎంపీగా పోటీ చేసిన విష‌యం తెలిసిందే.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఆమె స్థానాన్ని వేరే వారితో భ‌ర్తీ చేస్తే.. అప్పుడు పూర్తిస్థాయిలో జాతీయ రాజ‌కీ యాల‌పై ష‌ర్మిల దృష్టి పెట్టే అవ‌కాశం ఉంద‌ని పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ న‌డుస్తోంది. జాతీయ రాజ‌కీయాల్లో ష‌ర్మిల‌కు ఈజీ ఉంటుంద‌న్న‌ది ఆమె భావ‌న‌. ఏపీలో అయితే.. నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం.. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం ద్వారా.. రాష్ట్రంలో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్య‌త ఉంటుంది. కానీ.. జాతీయ రాజ‌కీయాల్లో అధిష్టాన‌మే అన్నీ చూసుకుంటుంది.

ఈ నేప‌థ్యంలోనే ష‌ర్మిల జాతీయ రాజ‌కీయాల వైపు మొగ్గు చూపుతున్నార‌న్న‌ది ప‌రిశీల‌కులు కూడా చెబు తున్న మాట‌. నిజానికి ష‌ర్మిల ఏపీ విష‌యంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. పార్టీని ముందుకు న‌డిపించ‌లేక పోతున్నారు. సీనియ‌ర్ల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌లేక పోతున్నారు. ఆమె వైఖ‌రి సీనియ‌ర్ల‌కు, సీనియ‌ర్ల వైఖ‌రి ఆమెకు కూడా న‌చ్చ‌డం లేద‌న్న వాద‌న గ‌త ఏడాది నుంచి కూడా వినిపిస్తోంది. అదే కేంద్రంలో అయితే.. ఎవ‌రితోనూ పెద్ద‌గా ప‌ని ఉండ‌దు. ఎవ‌రినీ బుజ్జ‌గించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు.

పైగా జాతీయ‌స్థాయిలో ష‌ర్మిల‌కు గుర్తింపు ఉంటుంది. దీంతోనే ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పేలా ఇప్ప‌టి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న‌ట్టు కూడా నాయ‌కులు చెబుతున్నారు. ఎలానూ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆమెను మార్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్న నేప‌థ్యంలో రాష్ట్రం కంటే ఢీల్లీ బెట‌ర‌ని.. దీని వ‌ల్ల తాను మ‌రింత ఎలివేట్ కావొచ్చ‌న్న ధీమాలోనూ ష‌ర్మిల ఉన్నార‌ని అంటున్నారు. మ‌రి దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News