గుట్టు తెలిసిందిట... జగన్ ఇక ఆపేది లేదట !
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు వ్యూహాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. అందరూ నడిచే దారిలో ఆయన నడవరు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు వ్యూహాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. అందరూ నడిచే దారిలో ఆయన నడవరు. నాటకీయంగా ఉంటాయని కొన్ని పనులు ఆయన అసలు చేయరు. తన మనసుకు ఏది నిజం అనిపిస్తే అది చేస్తారు. దానినే ఎప్పటికీ నమ్ముతారు. ఇక రాజకీయంగా చూస్తే జగన్ ది 17 ఏళ్ళ అనుభవం. మరో మూడేళ్లలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో జగన్ నేర్చుకున్న అనుభవాలు తక్కువేమీ కావని అంటున్నారు. అంతే కాదు ఆయనకు అన్నింటి కంటే జనం పల్స్ బాగా తెలుసు అని అంటున్నారు.
వారి భాష తెలుసు :
జనాల భాష ఆయనకు అర్ధం అయినంతగా ఎవరికీ కాదని అంటున్నారు. మరి ఎందుకు ఓటములు అంటే పార్టీలో లోపాలే అన్నది కూడా తెలుసు అంటున్నారు. 2024 లో కూడా వైసీపీ దారుణంగా ఓడాల్సింది కాదని వైసీపీ వారే కాదు తటస్థులు విశ్లేషకులు కూడా అంటారు, పార్టీ కాడె వదిలేసిన క్యాడర్ పట్టించుకోని లీడర్ల వల్లనే అలాంటి రిజల్ట్ వచ్చిందని కూడా చెబుతారు. అందుకే జగన్ ఈసారి పక్కా ప్లాన్ తో ఉన్నారని అంటున్నారు. అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని కూడా చెబుతున్నారు.
ఆ కిక్కే వేరే లెవెల్ :
ఇదిలా ఉంటే 2024 భారీ ఓటమి తరువాత జగన్ కొన్నాళ్ళ పాటు తాడేపల్లి ఆఫీసులోనే ఉండిపోయారు. అలాగే జనానికి దూరం పాటించారు. ఇటీవలనే ఆయన బయటకు వస్తున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అఫ్ కోర్స్ అవి పార్టీ నేతల పరామర్శలు అనుకున్నా కూడా జగన్ జనం మూడ్ ని కూడా అధ్యయనం చేయడానికే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. ఈ మధ్యనే జగన్ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రా కర్నూల్ పర్యటనలు చేపట్టారు. ఎక్కడ చూసినా జనాలు తండోపతండాలుగా వచ్చారు. అంతటా ఒకే రకమైన ఆదరణ, ఒకే రకమైన అభిమానాన్ని జనాలు చూపించారు. దాంతో జగన్ తో పాటు వైసీపీ కూడా ఫుల్ జోష్ లో ఉంది అని చెబుతున్నారు. ఇక ఈ టూర్లు వైసీపీకి ఇచ్చిన కిక్ వేరే లెవెల్ అని అంటున్నారు.
అన్ని మంచి లాభాలే :
ఈ టూర్ల వల్ల వైసీపీకి అన్నీ మంచి రాజకీయ లాభాలే అని అంటున్నారు. వైసీపీ లీడర్ లో క్యాడర్ లో నిరాశను ఒక్కసారిగా ఉఫ్ అని ఊదేసినట్లు అయింది అని అంటున్నారు. జనంలో వైసీపీ ఉంది, కష్టపడితే విజయం మనదే అన్న ధీమా వారికి వచ్చింది అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ కోసం ఏమైనా చేయవచ్చు, కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసినా జనాలు ఉన్నారు అన్న భరోసా కూడా వారిలో ఏర్పడింది అని అంటున్నారు. ఆ విధంగా జగన్ టూర్లు పార్టీలో ఫుల్ హుషార్ ని నింపాయని అంటున్నారు. అంతే కాదు కూటమి పెద్దలలో గుబులు కూడా తీసుకుని వచ్చాయని వైసీపీలో చర్చ సాగుతోంది. కేవలం రెండేళ్ళు మాత్రమే కూటమి పాలన పూర్తి అయిన ఈ తరుణంలో జగన్ వెంట జనాలు వెళ్తున్నారు అంటే కూటమి ఉలిక్కిపడేలా పరిస్థితులు ఉన్నాయా అన్న చర్చ కూడా అటు వైపు ఉంది. ఆ విధంగా కూటమిలో తర్జన భర్జనను పెంచేలా జగన్ టూర్లు చేయగలిగాయి అని అంటున్నారు.
ఇదే జోరుతో ముందుకే :
మరి తమకు పట్టు ఎంత ఉందో తెలిసింది, కూటమిలో గుబులు పెంచామని ఆ విధంగా వారి గుట్టు తెలిసిందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్టీలో కూడా వేయి ఏనుగుల బలాన్ని ఇస్తోంది. కాబట్టి టూర్లు అసలు ఆపకూడదని అధినాయకత్వం గట్టిగా తీర్మానించుకుంది అని అంటున్నారు. తప్పు మనదే తప్ప జనాలది కాదు, గట్టిగా కష్టపడితే జనాలు మన వైపు చూసి ఆదరించి అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా వైసీపీలో చర్చ సాగుతోంది. దాంతో ఈ దూకుడుని కంటిన్యూ చేయాలని జనంలో ఉంటూ జనంతోనే జగన్ అన్నట్లుగా రానున్న రోజులలో మరింత విస్తృతంగా పర్యటనలు చేయాలని వైసీపీ భారీ ప్లాన్స్ తో సిద్ధంగా ఉంది అని అంటున్నారు. జనాలలో జగన్ ఉంటే ఎన్ని ఆంక్షలు ఎవరు పెట్టినా రెట్టింపు బలంతో దూసుకుపోవచ్చు అన్నదే ఆ పార్టీ ఆలోచనగా ఉందిట. సో జగన్ ఇక మీదట మరిన్ని టూర్లకు రెడీ అవుతున్నారు. ఎపుడు ఎక్కడ అంటే వెయిట్ అండ్ సీ.