ఆ సెగ్మెంట్‌లో మ‌హిళా నేత‌ల‌దే రాజ్యం.. !

రాష్ట్ర వ్యాప్తంగా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ కూట‌మి మ‌ధ్య భారీ పోరు సాగింది. దీనిలో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది.. పురుషులు వ‌ర్సెస్ మ‌హిళా నాయ‌కుల మ‌ధ్య జ‌రిగిన పోరు.

Update: 2026-08-17 23:30 GMT

రాష్ట్ర వ్యాప్తంగా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ కూట‌మి మ‌ధ్య భారీ పోరు సాగింది. దీనిలో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది.. పురుషులు వ‌ర్సెస్ మ‌హిళా నాయ‌కుల మ‌ధ్య జ‌రిగిన పోరు. దాదాపు 45 నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హిళ‌లు వ‌ర్సెస్ పురుషుల మ‌ధ్య పోటీ తీవ్రంగా సాగింది. దీనిలో రెండు ప‌క్షాలు కూడా ఉన్నాయి. వైసీపీ మ‌హిల‌ల‌కు టికెట్ ఇచ్చిన స్థానంలో టీడీపీ లేదా కూట‌మి నుంచి పురుషులు పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, టీడీపీ కూటమి త‌ర‌ఫున మ‌హిళ‌లు పోటీకి దిగిన స్థానాల్లో వైసీపీ పురుష అభ్య‌ర్థులు పోటీకి దిగారు.

ఇలా.. కొన్ని సెగ్మెంట్ల‌లో పురుషులు వ‌ర్సెస్ మ‌హిళా నాయ‌కుల మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. వీరిలో 22 మంది మ‌హిళ‌లు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదిలావుంటే.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో కంటే. కూడా కొన్ని కొన్ని నియోజక‌వ‌ర్గాల్లో మ‌హిళ‌ల ఆధిప‌త్యం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అంటే.. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంతో పాటు.. ప్ర‌భుత్వ పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌డంలోనూ మ‌హిళా నాయ‌కులు దూకుడుగా ఉన్నారు. పురుషుల‌తో కంపేర్ చేసుకుంటే వారే బ‌ల‌మైన నాయ‌కులుగా కూడా ఎదుగుతున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ త‌ర‌ఫున సీదిరి అప్ప‌ల‌రాజు పోటీ చేసి ఓడిపోయారు. ఇక్క‌డ నుంచి గౌతు శిరీష టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. స్థానికంగా ఆమె బ‌ల‌మైన నాయ‌కురాలిగా ఎదిగారు. ఇక‌, గుంటూరు వెస్ట్‌లో విజ‌యంద‌క్కించుకున్న గ‌ల్లా మాధ‌వి, నెల్లిమ‌ర్ల‌లో లోకం మాధ‌వి (జ‌న‌సేన‌), క‌డ‌ప‌లో రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వి, రంప‌చోడ వ‌రంలో మిరియాల శిరీష‌.. వంటివారు ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన ముద్ర వేస్తున్నారు. త‌ద్వారా.. వారికి తిరుగులేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయాలు కూడా ఇక్క‌డ పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఒక్క చోట‌..

ఇక‌, ఉమ్మడి అనంత‌పురం జిల్లాలోని పెనుకొండ‌లో మాత్రం కొంత భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ నుంచి మంత్రి స‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మంత్రిగా కూడా ఉన్నారు. కానీ, గ‌త ఎన్నిక‌ల్లోఓడిపోయిన మాజీ మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ దూకుడు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి వ‌ర్సెస్ మాజీ మంత్రి మ‌ధ్య రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఒక‌రిపై ఒక‌ళ్లు స‌వాళ్లు కూడా రువ్వుకుంటున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా మిగిలిన చోట్ల మాత్రం మ‌హిళా మ‌ణుల రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయ‌నే చెప్పాలి.

Tags:    

Similar News