జగన్ ఇంట ఆనంద దీపావళి

Update: 2025-10-20 16:03 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దీపావళిని పురస్కరించుకుని బెంగళూరులోని తన నివాసంలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయన తన సతీమణి భారతితో కలసి ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఆయన చిచ్చుబుడ్డి కలుస్తూ ఉవ్వెత్తిన ఎగిసిపడిన ఆ వెలుగులను ఆనందంగా తిలకించారు. అంతే కాదు తన సతీమణితో కలసి మరిన్ని చిచ్చుబుడ్లలను ఉత్సాహంగా కాల్చారు.

 

లోగిలంతా సంబరం :

జగన్ నివాసం ఉంటున్న బెంగళూరులోని లోగిలి అంతా దీపావళి సంబరాలు జరిగాయి. ఆయన సిబ్బందితో పాటు ఇతరులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. మొత్తం లోగిలి అంతా చిచ్చుబుడ్డులు టపాసులతో అమర్చి మరీ సందడి చేశారు. జగన్ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

 

గతానికి భిన్నంగా :

 

గతంలో పెద్దగా ఈ తరహా వేడుకల విషయంలో ఆసక్తి చూపించని జగన్ సీఎం అయ్యాక తన వైఖరి మార్చుకున్నారు. ఆయన హిందువుల పండుగలు అన్నింటిలో పాల్గొంటున్నారు. ఈ మధ్యనే తాడేపల్లిలోని నివాసంలో వినాయక చవితి వేడుకల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు. ఇపుడు బెంగళూరులో దీపావళి సంబరాలు చేశారు.

 

అందరి వాడిగా :

రాజకీయ నాయకులకు చూస్తే మతాలు కులాలు ఉండవని చెబుతారు. అందరివారుగానే వారు ఉంటారు, అలా ఉండాలి కూడా. అయితే వైఎస్సార్ ఫ్యామిలీలో మాత్రం జగన్ మాత్రమే అన్ని పండుగలలో ఎక్కువగా పాల్గొంటూ వస్తున్నారు. అంతే కాదు ఆయన దేవాలయాల సందర్శన చేయడం హోమాలు యాగాలలో పాల్గొనడం కూడా చేస్తూ వచ్చారు. ఆ విధంగా తనకు పరమత విశ్వాసం ఉందని చాటి చెబుతూ వస్తున్నారు.

 

ఇంట్లోనే అలా అంటూ :

ఆ మధ్య కల్తీ లడ్డూ ఇష్యూ వచ్చినపుడు జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తన మతం మావత్వం అని. తాను ఇంట్లో మాత్రమే క్రిస్టియన్ అని కూడా అన్నారు. బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తాను అని చెప్పారు. ఆ విధంగానే ఆయన ఆచరించి చూపుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ తన ఇంట చేసుకున్న దీపావళి సంబరాలను చూసి వైసీపీ క్యాడర్ కూడా హుషార్ చేస్తోంది. తమ నాయకుడు పండుగలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అంటూ ఆ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తెలుగు నాట దీపావళి వేడుక :

మొత్తం మీద చూస్తే దీపావళి వేడుకలను దేశమంతా జరుపుకుంటోంది. అలాగే ప్రపంచంలో పలు చోట్ల కూడా జరుపుకుంటున్నారు ఇక తెలుగు నాట రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సెలిబ్రిటీస్ అంతా కూడా ఎంతో హుషారుగా వేడుకలలో పాల్గొంటున్నారు. పెద్దలంతా పిల్లలుగా మారిన రోజుగా దీపావళిని అంతా గుర్తు చేసుకుంటారు. అదే తెలుగు లోగిళ్ళలో ఎల్లెడలా కనిపిస్తోంది.

Tags:    

Similar News