వింటర్ సెషన్... ఇప్పటి నుంచే హీట్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ని ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి 19 వరకూ ఇవి జరగనున్నాయి.;
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ని ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి 19 వరకూ ఇవి జరగనున్నాయి. ఈ వివరాలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మెరరకు ప్రతిపాదనల్ వెల్లడంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దాంతో చలికాలం సమావేశాలకు రంగం సిద్ధం అయింది.
ఎన్డీయే వర్సెస్ కాంగ్రెస్ :
శీతాకాల సమావేశాల ప్రకటన వచ్చిందో లేదో కాంగ్రెస్ నుంచి విమర్శలు కూడా మొదలైంది. ఈసారి సమావేశాలు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి అర్ధవంతమైన చర్చలకు వేదిక కావడానికి అని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజి ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ కూడా ధాటీగానే విమర్శలు చేసింది. లేట్ గా శీతాకాల సమావేశాలు పెట్టారు, అయినా కూడా తక్కువ రోజులకు తగ్గించేశారు అంటూ హాట్ కామెంట్స్ చేసింది.
ప్రభుత్వానికి అవసరం లేదు :
పార్లమెంట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలన్నది ప్రభుత్వానికి లేదని ఆ అవసరం కూడా కనిపించడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ వేదికగా బిల్లులు ఆమోదించాల్సిన పని కానీ చర్చలకు అనుమతించాల్సిన అవసరం కానీ ఎక్కడా లేదని సెటైర్లు పేల్చారు. అందుకే అతి తక్కువ రోజులు వింటర్ సెషన్ ని నిర్వహిస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వానికి లావాదేవీలు చేయాలని ఉంటే పార్లమెంట్ సెషన్ లో ఎక్కువ రోజులు డిస్కషన్ కి చాన్స్ ఉండేదని అంటున్నారు. అసలు పార్లమెంట్ సెషన్ ని తగ్గింది ఏ విధమైన సందేశం ఇస్తున్నారు అని కేంద్ర పెద్దలను ప్రశ్నించారు. గత ఏడాది శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరిగాయని ఇపుడు చూస్తే ఇంకా తగ్గించేశారు అని ఆయన మండిపడ్డారు.
వర్షార్పణం అయ్యాయి :
అయితే పార్లెమెంట్ వర్షాకాల సమావేశాలు అయితే జులై 21వ తేదీన ప్రారంభమైన ఆగస్టు 21వ తేదీన ముగిశాయి. అవి కూడా ఒక రోజు ముందుగానే ముగిసాయి. ఇక ఈ వర్షాకాల సమావేశాలు సైతం చర్చలు పెద్దగా జరగలేదు. మొతం వర్షాకాల సమావేశాల్లో కేవలం 21 రోజుల పాటు సభలు నడిచాయి. బిహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ అంశం మీదనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో అనేక సార్లు సభలు వాయిదా పడ్డాయి. దాంతో లోక్‌సభ ఉత్పాదకత దాదాపు 31 శాతం ఉండగా, రాజ్యసభ ఉత్పాదకత దాదాపు 39 శాతంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇపుడు చూస్తే వింటర్ సెషన్ ని తగ్గించేశారు. ఈసారి సభ ఎలా జరుగుతుంది అంటే హోరా హోరీగానే అని అంటున్నారు.