• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విశాఖ డ్రగ్స్ కేసు......

విశాఖ డ్రగ్స్ కేసు... "సింగం" సినిమా తరహాలో సీబీఐ నెక్స్ట్ స్టెప్!!

| అవును... అత్యంత సంచలన విషయంగా మారిన విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసిందని తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-03-27 13:11 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్యంగా విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ముందుగా టీడీపీ ఆరోపణలు గుప్పించగా.. మరుసటిరోజు ఉదయం వైసీపీ రివర్స్ అటాక్ ఇచ్చింది! ఆ సంగతి అలా ఉంటే... ఈ వ్యవహారంపై సీబీఐ నెక్స్ట్ స్టెప్ తీసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... బ్రెజిల్ కు సీబీఐ స్పెషల్ టీం వెళ్లనున్నట్లు తెలుస్తోంది!

అవును... అత్యంత సంచలన విషయంగా మారిన విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ వ్యవహారం వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయని... ఫలితంగా... డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోందట.

ఈ మేరకు ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్స్ డేటా, ఈ-మెయిల్స్ తో పాటు వాట్సప్ చాట్ లను పరిశీలించి, కొంత మేర సమాచారం సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో... నార్కోటిక్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తూ బృందం ఎదురుచూస్తోందని అంటున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లను సీబీఐ సేకరించిందని.. సంస్థ ప్రతినిధుల కదలికలపై నిఘా పెట్టిందని సమాచారం!

కాగా... ఈ విషయంలో సంధ్యా అక్వా సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ... తమ సంస్థ తీసుకొచ్చిన డ్రై ఈస్ట్ లో డ్రగ్స్ ఎలా వచ్చాయ్యో తమకు తెలియదని చెబుతోన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మరికొన్ని బ్యాగ్ లను పరీక్షించగా.. వాటిల్లోని సుమారు 70శాతం డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో... ఇప్పటికే.. బ్రెజిల్ నుంచి ఫీడ్ ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడ నుంచే తెప్పించుకోవడానికి గల ప్రత్యేక కారణాలు.. విశాఖ పోర్టునే ఎంచుకోవడానికి గల కారణాలు వంటి ప్రశ్నలతో పాటు.. నిర్ణీత వ్యవధిలో వీటిని ఎలా విక్రయిస్తారు అనే మొదలైన ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది.

Tags:    
  • Andhrapradesh 
  • Vishakadrugcase 
  • CBI 
  • Brazil 
  • Email 
  • Whatsapp 
  • Material 
  • Documentaryevidence 
  • Politicalnews 

Similar News

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

2026-11-17 05:35 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

ఆస్ట్రేలియాలో చదువుతున్న వారికి కొత్త తలనొప్పి.. కుటుంబ సభ్యుల వీసాపై మారిన రూల్స్!

2026-11-17 04:41 GMT

విజయ్ కు అందలం.. సీఎంలు రేవంత్, డీకే, సతీషన్ కు మంగళం.. ఇలా చేస్తే కాంగ్రెస్ ను అనరా మరీ..

2026-11-17 04:40 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

దివాళా తీసిన 'బైజుస్' ఆస్తులు కొన్న మీషో అధినేత‌.. 84 కోట్లు రిస్క్ చేసారా?

2026-11-17 04:09 GMT

ఎల‌క్ట్రిక్ విప్ల‌వంతో పెట్రోల్- డీజిల్ వినియోగం త‌గ్గిందా? వాస్త‌వం తెలిస్తే షాకింగే!

2026-11-17 04:08 GMT

23 లో వైసీపీ ఆశలు...టఫ్ ఫైట్ ఖాయమా ?

2026-11-17 04:07 GMT

కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మ‌గ్గాడు.. ఈ న‌ర‌కానికి ప‌రిహారం 30ల‌క్ష‌లు!

2026-11-17 04:07 GMT

రాహుల్ నవ్వులపాలు కావొద్దు.....బీజేపీ హితవు వెనక ?

2026-11-17 04:06 GMT

చైనాకు చెక్: AI సప్ల‌య్ చైన్ ర‌క్ష‌ణ‌కు భార‌త్ స‌హా 9 దేశాల ఒప్పందం!

2026-11-16 19:30 GMT

కోస్తా మీద పడగ విప్పనున్న అక్వాన్

2026-11-16 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS