విశాఖకు మరో వరం....అత్యాధునిక సైక్లింగ్ ట్రాక్
విశాఖ ఇపుడు మరింతగా అభివృద్ధి చెందనుంది. విశాఖ అభివృద్ధి చెందిన నగరమే కదా మళ్ళీ వేరేగా ప్రగతి దారులు వెతకాలా అంటే విశాఖ ఎప్పటికీ ఎదుగుతూనే ఉన్న మహా నగరం.;
విశాఖ ఇపుడు మరింతగా అభివృద్ధి చెందనుంది. విశాఖ అభివృద్ధి చెందిన నగరమే కదా మళ్ళీ వేరేగా ప్రగతి దారులు వెతకాలా అంటే విశాఖ ఎప్పటికీ ఎదుగుతూనే ఉన్న మహా నగరం. ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. దానికి గతిన అవకాశాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ఇచ్చారు. రానున్న రోజులలో విశాఖలో అత్యాధునిక సైక్లింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేస్తామని ఆయన లేటెస్ట్ గా చేసిన ట్వీట్ ద్వారా ప్రకటించారు.
రియాక్ట్ అయిన బాబు :
ఇదిలా ఉంటే విశాఖను బెంగళూరు తో పోలుస్తూ ఒక సంస్థ తాజాగా కితాబు ఇచ్చింది. అదే సమయంలో విశాఖలో ఉన్న పచ్చదనం మీద పొగడ్తలు కురిపించింది. అక్కడ ఫుట్ పాత్ లు సైతం చక్కగా ఉంటాయని పేర్కొంది. బెంగళూరు కంటే కూడా విశాఖ చాలా విషయాలలో మెరుగ్గా ఉందని ఒక పోలిక కూడా తెచ్చింది. అందువల్ల విశాఖలో సైక్లింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని సివిక్ అప్పోజిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఐటీ మంత్రి లోకేష్ కి ఒక కీలక సూచన చేసింది. దానికి సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. తపకుండా విశాఖలో ఆధునిక సైక్లింగ్ ట్రాక్స్ ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆ వెంటనే హామీ ఇచ్చారు.
ఫ్యూచర్ ఐటీ హబ్ గా :
విశాఖకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అందువల్ల విశాఖకు కనుక సరైన సదుపాయాలను ఇతర మౌలిక వసతులు కల్పిస్తే కనుక తప్పకుండా బెంగళూరు తరువాత మంచి ఐటీ హబ్ గా మారుతుందని కూడా సివిక్ అప్పోజిషన్ ఆఫ్ ఇండియా సంస్థ అభిప్రాయపడింది. ఆ దిశగా విశాఖను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వానికి వినతి చేసింది.
విశాఖ కోసమంటూ :
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈ పోస్టులకు పూర్తి పాజిటివ్ గా రియాక్ట్ అవుతూనే విశాఖని అన్ని విధాలుగా మరింతగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అంతే కాదు విశాఖలో పాదచారుల కోసం అనువైన ఫుట్ పాత్ లు ఉన్నాయని, అలాగే ఎంతో పచ్చదనం అక్కడ ఉందని చెప్పారు. అలాగే విశాఖ అందాలు సహజసిద్ధమైన ప్రకృతి నగరవాసులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ఎంతో మంచి అనుభూతిని అందిస్తోందని అన్నార్. ఈ నేపధ్యంలో విశాఖను మరింత అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలను కూడా ఇంకా మెరుగ్గా మారుస్తామని కూడా వెల్లడిచారు. దీంతో విశాఖకు మరిన్ని కొత్త సొబగులు రానున్నాయని విశాఖ వాసులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.