గాల్లో ఎగురుతున్న ఫ్లైట్లో టాయిలెట్ లో సమస్యలు.. సిబ్బంది తీరుకి ప్రయాణికులు అసహనం!

ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తరచూ విమానాల్లో పలు సమస్యలు తలెత్తుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.;

Update: 2025-08-31 10:58 GMT

ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తరచూ విమానాల్లో పలు సమస్యలు తలెత్తుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఏడాది అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతమందిని బలి తీసుకుందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ విమాన ప్రమాదం జరిగాక పలు విమానాలు స్టార్ట్ అయ్యే ముందు వాటి కండిషన్ ఎలా ఉంది అని ముందుగానే చూసుకుంటున్నారు. కానీ ఎన్నిసార్లు టెక్నికల్ సమస్యలు రాకుండా చూసుకున్నా కూడా ఏదో ఒక మూలన విమానాల్లో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఒక వార్త మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమాన ప్రయాణికులు టాయిలెట్ చేయడానికి కూడా వీల్లేకపోవడంతో చివరికి తాము తెచ్చుకున్న వాటర్ బాటిళ్లలోనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం..

ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడానికి.. తొందరగా గమ్యాన్ని చేరుకోవడానికి విమానాలను ఎంచుకుంటారు. అలా ఒక దేశం నుండి మరో దేశానికి గంటల్లో వెళ్తున్నారంటే అదంతా విమానాల వల్లే అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి విమానాలు ఎక్కాలంటేనే ప్రస్తుతం చాలా మంది భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు విమానంలో ఏ సమస్య వస్తుందో తెలియడం లేదు. టెక్నికల్ సమస్యల వల్ల విమానాలు గాల్లోనే కుప్పకూలిపోతున్నాయి. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి కూడా. దాంతో విమాన ప్రయాణికులు గమ్యాన్ని చేరేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

అదేంటంటే.. వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ (737 MAX 8) విమానం గురువారం నాడు మధ్యాహ్న సమయంలో బాలిలోని డెన్ పసర్ విమానాశ్రయం నుండి బ్రిస్బేన్ కి బయలు దేరింది. అయితే ఈ విమానంలోని ప్రయాణికులు గమ్యాన్ని చేరుకునే వరకు 6 గంటల సమయం పడుతుంది. అయితే విమానం స్టార్ట్ అయ్యే ముందు అన్ని సరిగానే ఉన్నాయని చూసుకున్నారు. కానీ తర్వాత సడన్గా విమానంలో సమస్యలు తలెత్తాయి..అదేంటంటే విమానంలోని ఒక టాయిలెట్ సరిగ్గా లేదని.. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తేలింది. దాంతో మూడు గంటల పాటు విమాన ప్రయాణికులు ఒకే టాయిలెట్ ని వినియోగించుకున్నారు. అయితే ఉన్న ఆ ఒక టాయిలెట్ లో కూడా సమస్యలు ఉన్నాయని తెలియడంతో చివరికి చేసేదేమీ లేక అందులో ఉన్న వృద్ధులు,పిల్లలు, మహిళలు ఎక్కువసేపు ఆపుకోలేక చివరికి తమ వాటర్ బాటిళ్లలో మూత్ర విసర్జన చేశారు.. ఇక ఓ వృద్ధురాలు అయితే మూడు గంటల పాటు టాయిలెట్ ఆపుకోలేక చివరికి సీట్ లోనే మూత్ర విసర్జన చేసిందట. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇది తెలిసాక చాలామంది నెటిజన్లు విమాన సిబ్బందిపై మండి పడుతున్నారు.

ముఖ్యంగా ఆ విమాన ప్రయాణికులు విమాన సిబ్బందిపై మండి పడుతూ కనీసం విమానం కండిషన్ ఎలా ఉందో చూసుకోకుండానే మమ్మల్ని ఇంత దూరం ఎలా తీసుకువచ్చారని మండిపడ్డారట. తమ విమానంలో తలెత్తిన సమస్య గురించి వర్జిన్ ఆస్ట్రేలియా స్పందిస్తూ.. విమానంలో తలెత్తిన సమస్యలకు, విమాన ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా కఠిన జాగ్రత్తలు తీసుకుంటాం. విమాన ప్రయాణికులకు ఫ్లైట్ క్రెడిట్ లు ఇస్తాము.. అంటూ చెప్పారు.అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పై చాలా మంది జనాలు కూడా మండి పడుతున్నారు.ఆరు గంటలపాటు మనిషి టాయిలెట్ చేయకుండా ఎలా ఉంటారు. ఆ విమానంలో ఎంత మంది చిన్న పిల్లలు..వృద్దులు.. ఆడవాళ్లు ఇబ్బందులు పడ్డారో.. ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News