వైసీపీలో చర్చకు తెర లేపిన విజయసాయి

వైసీపీలో అయితే కొందరు సోషల్ మీడియా క్యాడర్ సాయిరెడ్డి చెప్పిన విషయాలను పూర్తిగా ఏకీభవించారో లేదో తెలియదు కానీ ఆయన పార్టీకి ఒక ఆస్తి లాంటి వారు అని అంటున్నారు.;

Update: 2026-01-25 04:01 GMT

విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పేశారు. అందులో తన మనసులో ఏముందో అన్నీ వివరించి పూసగుచ్చినట్లుగా చెప్పారు. అంతే కాదు తాను ఏమిటి, వైసీపీలో తన పాత్ర ఏమిటి, తాను ఎంత సేవ చేశాను కోటరీ సంగతి గురించి చెప్పారు. తనను ఎలా బయటకు పంపించారో అన్నీ ఒక్కోటిగా చెప్పేశారు. గతంలోనూ ఆయన చెప్పినా తాజాగా చెప్పినట్లుగా ఇంత డీటైల్డ్ గా అయితే చెప్పలేదు అనే భావించాలి. దాంతో వైసీపీలో అయితే కొత్త చర్చకు ఆయన తెర లేపారని అంటున్నారు.

జగన్ కి పాలేరుని అంటూ :

ఈ మాట అయితే అసలైన వైసీపీ ఫ్యాన్స్ హార్ట్ కి గట్టిగానే గుచ్చుతోంది అని అంటున్నారు. ఇప్పటిదాకా ఏ నాయకుడు పార్టీని వీడినా అది ఏ పార్టీ అయినా ఇంతలా లోతుగా చెప్పిన దాఖలాలు లేవని అంటున్నారు. పార్టీలో నాయకులుగా మనగలగడానికి ఎవరి దయా ప్రాప్తం ఎంత వరకూ ఉన్నా వ్యక్తిగతంగా చూస్తే కనుక ఎవరి మటుకు వారు ఇమేజ్ ని స్టాటస్ ని కలిగి ఉంటారు. అలాంటిది సీనియర్ నేతగా రెండు సార్లు ఎంపీగా చేసిన వారిగా విజయసాయి రెడ్డి మీడియా ముందున తాను పాలేరు లాగానే కష్టపడ్డాను జగన్ కి పాలేరునే అని చెప్పిన మాటల మీద అయితే చర్చ సాగుతోంది. పార్టీలో ఎక్కడో ఏదో తేడా ఉంది అన్నది కూడా అంటున్న మాటగా ఉంది.

సాయిరెడ్డిని తీసుకోవాలా :

వైసీపీలో అయితే కొందరు సోషల్ మీడియా క్యాడర్ సాయిరెడ్డి చెప్పిన విషయాలను పూర్తిగా ఏకీభవించారో లేదో తెలియదు కానీ ఆయన పార్టీకి ఒక ఆస్తి లాంటి వారు అని అంటున్నారు. ఆయనను కోల్పోవడం వైసీపీకి నష్టమే అని అంటున్నారు. సాయి రెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది అన్న చర్చ కూడా కొంత మంది చేస్తున్నారు. విభేదాలు అన్ని పార్టీలలో వస్తాయని, నాయకుల విషయంలో ఒకటికి రెండు సార్లు పార్టీ పెద్దలు కూడా ఆలోచించాల్సి ఉంటుందని అంటున్నారు. తాను జగన్ కి పాలేరుని అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సాయిరెడ్డి వంటి వారిని వదులుకోవడం అంటే ఇబ్బందే అని అంటున్న వారూ ఉన్నారు.

జరిగే పనేనా :

అయితే వైసీపీలో ఒక వ్యూహం లేదని కూటమి విడిపోతేనే తప్ప వైసీపీకి విజయం దక్కదని జగన్ సీఎం కాలేడని సాయిరెడ్డి జోస్యం చెప్పారు. అంతే కాదు కోటరీ మీద ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. దాంతో ఆయనను తిరిగి వైసీపీ పెద్దలు పార్టీలోకి ఆహ్వానిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక వైసీపీ అధినేత జగన్ స్వభావం ఎరిగిన వారు అయితే అది జరిగే పని కాదని అంటున్నారు. ఆయన ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళేది ఉండదని అంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమిని చూసిన తరువాత 2029 ఎన్నికల కోసం సరైన వ్యూహ రచన చేయాల్సి ఉందని అందువల్ల అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నమే చేయాలని అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే సాయిరెడ్డి తాజా ప్రెస్ మీట్ తో వైసీపీలో కష్టపడి పనిచేసే వారిని ఎంతో కొంత డీమోరలైజ్ చేశారా అన్న చర్చ కూదా సాగుతోంది. పార్టీలో విజయసాయిరెడ్డి లాంటి వారినే పక్కన పెడితే రేపు మనమెంత అన్న ఆలోచనలు అతి కొద్ది మందిలో అయినా ఆయన కలిగించినా అది వైసీపీకి ఇబ్బందే అని అంటున్నారు.

Tags:    

Similar News