విజయ్...మీడియాకు దూరం !

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మీడియాకు దూరం పాటిస్తున్నారు. ఆయన తమిళనాడు వంటి పెద్ద స్టేట్ కి సీఎం అయ్యారు.

Update: 2026-05-30 03:55 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మీడియాకు దూరం పాటిస్తున్నారు. ఆయన తమిళనాడు వంటి పెద్ద స్టేట్ కి సీఎం అయ్యారు. మే 10న ఆయన ప్రమాణం చేశారు. ఇరవై రోజుల పాలనలో ఆయన ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టలేదు మీడియాతో ముచ్చటించలేదు. అంతే కాదు లేటెస్ట్ గా ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి విజయ్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు దాంతో తమిళ మీడియా మాత్రమే కాదు జాతీయ మీడియా కూడా చాలా ఆసక్తిగా ఆయన పర్యటనను చూసింది. ఇక మోడీతో పది హేను నుంచి ఇరవై నిముషాల పాటు విజయ్ భేటీ అయి అనేక అంశాల మీద చర్చించారు అని ప్రచారం సాగింది ఆ అంశాలు ఏమిటి అన్నది మాత్రం విజయ్ నేరుగా ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీ మీడియాను ఉద్దేశించి మాట్లాడలేదు సరికదా మీడియా పిలుస్తున్నా వచ్చేశారు అన్నది ఇపుడు అంతటా చర్చ సాగుతోంది.

కొత్త ట్రెండ్ గానే :

విషయానికి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రులు భిన్నమైన వైఖరులతో వ్యవహరించిన తీరుని అంతా చూస్తారు. ఎంజీఆర్ అయితే అసలు ఢిల్లీకి వెళ్ళిన సందర్భమే లేదు, జాతీయ స్థాయి నేతలే ఆయనను కలుసుకునేందుకు తమిళనాడుకు వచ్చేవారు. జయలలిత కూడా అతి కొద్ది సార్లు మాత్రమే వెళ్ళేవారు. కరుణానిధి కూడా జాతీయ నాయకులను తన దగ్గరకే రప్పించుకునేవారు.. స్టాలిన్ అయితే ఢిల్లీ టూర్లు పెట్టుకుని ప్రధానిని కలసి చర్చించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక తమిళనాడు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో జయలలిత కూడా బహు దూరం పాటించేవారు అని చెబుతారు. ఆమె తొలిసారి 1991 నుంచి 1996 దాకా పాలించినపుడు మీడియాను పూర్తిగా దూరం పెట్టారు. విపక్షాలు విమర్శలు చేసినా కనీసం ఖండించడం వివరణ ఇవ్వడం వంటివి చేయకపోవడం వల్లనే ఓటమి పాలు అయ్యామని తరువాత అన్నా డీఎంకే నేతలు చెప్పుకున్నారు. అయినా జయలలిత మొత్తం నాలుగు సార్లు పాలించిన సందర్భాలలోనూ మీడియాతో మాట్లాడింది తక్కువే అని చెబుతారు.

విజయ్ సైతం అలాగే :

ఇక విజయ్ సైతం మీడియాకు దూరం పాటిస్తున్నారు ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. విపక్షాలు విమర్శలు చేసినా టీవీకే ఇతర నాయకులు మాట్లాడుతున్నారు కానీ విజయ్ అపుడపుడైనా మాట్లాడడం లేదని అంటున్నారు. ఆయన మాటల కంటే చేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని టీవీకే నేతలు చెబుతున్నారు. మీడియాలో కనిపించాలన్న దాని కంటే ప్రజల కోసం పనిచేసి పేరు తెచ్చుకోవాలన్నదే విజయ్ ఆలోచన అని అంటున్నారు. అయితే ఈ విషయంలో విపక్షాలు విజయ్ ని అసలు ఒదిలిపెట్టడం లేదు.

డీప్ స్లీప్ మోడ్‌లోకి అంటూ :

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి విజయ్ డీప్ స్లీప్ మోడ్‌లోకి వెళ్ళారని విపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ విమర్శించాఉర్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతోందని హత్యలు దోపిడీలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లు గా వ్యవహరిస్తోంది అని ఉదయనిధి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కడలూరులో సుమారు పాతికేళ్ళ వయసు ఉన్న యువతి దారుణ హత్యకు గురవడం తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. దాంతో మహిళా భద్రత అని గొప్పగా చెప్పిన టీవీకే ప్రభుత్వం తీరు ఇదేనా అని విపక్షాలు దుయ్యబెడుతున్నాయి. విజయ్ ది సోఫా మోడెల్ గవర్నమెంట్ అని కూడా ఉదయనిధి ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో గట్టిగా మాట్లాడిన విజయ్ ఇపుడు సైలెంట్ అయిపోయారు అని కామెంట్స్ చేశారు. విజయ్ ప్రభుత్వం ఇంకా నేర్చుకునే దశలో ఉంటే లా అండ్ ఆర్డర్ ని ఫణంగా పెడితే తాము సహించేది లేదని కూడా ఉదయనిధి హెచ్చరించారు.

Tags:    

Similar News